ఇప్పటికే కరోనా వైరస్‌తో, మానసిక వ్యాధులతో హస్పిటల్స్ అన్ని నిండుకున్నాయి.. కాగా ఇప్పుడు మరో సమస్య వెంటాడుతుంది.. అంబులెన్స్ సైరన్ మోగినట్టుగా ఇప్పుడు ఒక ఫోన్నెంబర్ విరామం లేకుండా మోగుతుందట.. అదే 1098 నెంబర్.. ఈ నంబర్ గురించి అందరికి తెలియక పోవచ్చూ.. కానీ నిత్యం హింసను ఎదుర్కొంటున్న వారికి ఈ నంబర్ నోటిలోనే ఉంటుంది.. అదేమంటే లాక్‌డౌన్ కాలంలో ఈ నంబరుకు ఫోన్ల తాకిడి విపరీతంగా పెరిగిందట. మార్చి 20 నుంచి 31 మధ్య కాలంలో దేశంలో కష్టాల్లో ఉన్న పిల్లల నుంచి 3.07లక్షల ఫోన్ కాల్స్ వచ్చాయట. వాటిలో 92వేలకు పైగా ఫోన్‌కాల్స్ హింస, దౌర్జన్యాలు, దుర్మార్గాలను తాళలేక రక్షణ కోసం చిన్నారులు చేసినవేనట. ప్రధానిమోదీలాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన తర్వాత ఈ నంబర్‌కు ఫోన్‌కాల్స్ రావడం 50 శాతం పెరిగాయనే విషయం వెలుగులోకి వచ్చింది..
చాలమంది పిల్లలు మా యజమాని మమ్ములను తీవ్రంగా వేధిస్తున్నాడు సర్.. ఆయన హింసకు తట్టుకోలేక పోతున్నాం సర్.. సార్.. మీరే ఎలాగైనా కాపాడండి సర్ అంటూ.. 1098 నంబర్‌కు కాల్ చేసి చెబుతున్నారట.. ఈ విషయాన్ని సాక్షాత్తు చైల్డ్‌లైన్ ఇండియాడిప్యూటీ డైరెక్టర్ హర్లీన్ అహ్లూవాలియా ఒక చర్చా గోష్ఠిలో చెప్పారట. పాపం.. పిల్లలపై మనుషులు అని చెప్పుకునే పశువులు ఎందుకు ఇంత దాష్టీకానికి దిగుతున్నారో ఏంటో మరి.! ఇకపోతే 1098 నంబర్ మీకు గుర్తుంది కదా. కష్టాల్లో, ప్రమాదాల్లో ఉన్న చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్..
]]>