భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో అంతకంతకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 6, 412 కు చేరినట్లు మినిస్ట్రీ ఆఫ్హెల్త్అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటన్ విడుదల చేసింది. ఇందులో దేశంలో 5,709 మందికి ప్రస్తుతం దవాఖానల్లో చికిత్స కొనసాగుతోంది. అందులో 504 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది.
ఇప్పటి వరకు కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 199కి చేరిందని తెలిపింది. గత 12 గంటల్లోనే దేశవ్యాప్తంగా కరోనాతో 30 మంది మరణించినట్లు మినిస్ట్రీ ఆఫ్హెల్త్అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ బులిటన్ వెల్లడించింది. కాగా దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ స్టేజ్‌లో ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి. దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలోనే ఈ రాష్ట్రం పాజిటివ్ కేసుల్లో మొదటి స్థానంలో ఉంది.
]]>