Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305672

పుష్ప టైటిల్ లో కనిపించేవి వేలిముద్రలేనా..?

$
0
0
స్టైలిష్ స్టార్అల్లు అర్జున్అల వైకుంఠపురములోబ్లాక్ బస్టర్విజయం తర్వాత విలక్షణ దర్శకుడు సుకుమార్తో సినిమాచేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ రివేంజ్ డ్రామాలో బన్నీలారీ డ్రైవర్గా కనిపిస్తున్నాడు. చిత్తూరు ప్రాంత నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకోసం ఆ జిలా యాసని నేర్చుకున్నాడట.

ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం బన్నీకి మొదటి పాన్ ఇండియాచిత్రం. పుష్ప అనే ఆడవాళ్ల పేరుని టైటిల్ గా పెట్టిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ట్రెండింగ్ లో ఉంది. ఊరమాస్ గా లో బన్నీలుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చింపిరి జుట్టు, గుబురు గడ్డం, చేతికి కడియం, మెడలో తాయెత్తు, చొక్కాకి రెండు బటన్లు వదిలేయడం చూస్తుంటే ఇది కంప్లీట్ మాస్ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది.



అయితే ఫస్ట్ లుక్ పోస్టర్లో మనకి కనిపించని చాలా డీటైల్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో పట్టుబడ్డ బన్నీనేలమీద కూర్చున్న పొజిషన్ లో ఎడమ కాలికి ఆరు వేళ్ళు కనిపించాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం గురించే చర్చ జరుగుతుంది. ఇక మరో విషయం టైటిల్ లోగోలో కనిపించే ముద్రలు వేలిముద్రలేనా అన్న అనుమానం కలుగుతుంది. కొందరైతే అవి వేలిముద్రలే అనీ, వాటికి కథకి ఏదో సంబంధం ఉందని అంటున్నారు.



అయితే నిజానికి అవి వేలిముద్రలు కావట. భారీవృక్షాలని మొదళ్లకి నరికేస్తే దానిమీద వలయాలు కనిపిస్తాయి. వాటి ద్వారా ఆ చెట్టు జీవితకాలాన్ని లెక్కించవచ్చు. పుష్ప టైటిల్ లోగోలో కనిపించే ఆ వలయాలు కూడా వృక్షానివేనట. ఎర్రచందనం కలప స్మగ్లింగ్ నేపథ్యంలో కథ సాగుతుంది కాబట్టి, దానికి రెసెంబ్లెన్స్ గా వలయాలని పెట్టారని అంటున్నారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305672

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>