Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305672

తమన్నాకు ఎక్కడో కాలిందిట ?

$
0
0
అసలే అందగత్తె. ఆపై నటనలో మేటి. స్టార్ హీరోలందరితోనూ నటించేసి సూపర్ స్టార్అనిపించేసుకుంది. ఇక పదిహేనేళ్ళ కెరీర్ ముగిసినా కూడా ఇంకా అందంగానే ఉంటోంది. యూత్ తో నటించేందుకు రెడీ అంటోంది. పెళ్ళి కొన్నాళ్ళు వాయిదా వేసైనా సరే నటనకే జీవితం అంకితం అంటోంది.

గత ఏడాది ఎఫ్ టూ తో రెచ్చిపోయేలా అందాలు చూపించి కుర్ర కారుని ముగ్గులోకి దించేసిన తమన్నాని పట్టుకుని అంత మాట అంటారా. మరి ఆమెకు చిర్రెత్తిపోదూ. ఇంతకీ ఆమెను అన్న మాటేంటి. అసలు తమన్నాకు అంత గుస్సా ఎందుకు వచ్చింది.



ఈ ప్రశ్న. జవాబు రెండూ ఆసక్తికరమే. తమన్నాఇపుడు బాగా ఖాళీ అన్నారట ఎవరో . అది ఇండస్ట్రీవారు అన్నారా, లేక మీడియాలో అలా ప్రచారం జరుగుతోందా ఏది ఏమైతేనేం  తమన్నా చెవులకు ఆ మాటలు సోకాయి. అంతే ఆమె ఆడ పులిలా రెచ్చిపోయింది.



నన్ను పట్టుకుని అలా అంటారా, నెనెక్కడ ఖాళీగా ఉన్నాను అంటోంది. గోపీచంద్ మూవీలో నటిస్తున్న తమన్నాఆ మూవీలో పాత్ర కోసం కబడ్డీ కూడా నేర్చుకుంటోందిట. ఇన్నేళ్ళ కెరీర్లో కూడా తాను ఇంకా ఇంతటి డెడికేషన్ తో పనిచేస్తూంటే తనను ఖాళీ అంటారా అని మండిపోతోంది.



నాకు సినిమాలు లేక కాదు, రాక కాదు, ఎన్నో వస్తున్నాయి. వాటి నుంచి సెలెక్ట్ చేసుకుని మరీ నటిస్తున్నాను అంతే. నాకు ఉన్న అవకాశాలు నాకు ఉన్నాయి. నేనేమీ అసలు  ఖాళీగా లేను. అలా ప్రచారం చేసే వారికి ఇదే నా గట్టి సమాధానం అంటోంది. మరి ఆమె మాటతోనైనా తమన్నాఖాళీ అంటూ కంగాళీ మాటలు ఆపుతారా. ఏమో అనే వాళ్ళు అంటూనే ఉంటారు. అంతే. తమన్నాకాం గా తన పని తాను చేసుకుంటే బెటరేమో.


]]>

Viewing all articles
Browse latest Browse all 305672

Trending Articles