Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305672

వైద్యులకు, నర్సులకు రెట్టింపు జీతం ఇవ్వనున్న ఆ రాష్ట్ర సీఎం..!

$
0
0
ప్రపంచమంతటా కరోనా వైరస్వ్యాప్తి ని అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు, నర్సులు నిర్విరామంగా చేస్తున్న శ్రమ మాటల్లో చెప్పలేనంత విలువైనది. ఒకవేళ వాళ్లే లేకపోతే ప్రపంచం మొత్తం ఇప్పటికే స్మశాన వాటికగా మారిపోయేది. కరోనా వైరస్ప్రాణాంతకమైన అంటువ్యాధి అని తెలిసిన చాలా మంది డాక్టర్లు వ్యాధిగ్రస్తుల వద్దకు వెళ్లి చికిత్సనందిస్తున్నారు. కొంతమంది డాక్టర్లు తమకు సరైన రక్షణ వస్తువులు లేకపోయినప్పటికీ... తమ ప్రాణాలకు తెగించి మరీ ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. డాక్టర్లు, నర్సులు కనిపించే దేవుళ్ళు అని ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులు చెప్తున్నారు అంటే వారు ఎంత కీలకమైన పాత్ర వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దేశాన్ని కాపాడే ఆర్మీకంటే ప్రస్తుతం వైద్యులే ఎక్కువగా శ్రమిస్తున్నారు. అందుకే వారి శ్రమను గుర్తించి వారిని అభినందించడం మన యొక్క బాధ్యత అని ప్రధానినరేంద్ర మోడీమన తోటి చప్పట్లు కొట్టించాడు. కేవలం ప్రధానినరేంద్ర మోడీమాత్రమే కాదు రాష్ట్ర సీఎం లు కూడా వైద్యులకు ఎనలేని ప్రాముఖ్యత ఇస్తున్నారు.


తాజాగా హర్యానారాష్ట్ర ముఖ్యమంత్రిమనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ... కరోనా వైరస్వ్యాప్తి నియంత్రణకు అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులకు, నర్సులకు, ఇతర పారామెడికల్ సిబ్బందికి రెట్టింపు జీతాలను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే వరకు వైద్యులకు, నర్సులకు డబల్ శాలరీలు ఇస్తామని హర్యానారాష్ట్ర ముఖ్యమంత్రిప్రకటించారు. అలాగే పోలీసులు కూడా డాక్టర్ల స్థాయిలో కరోనా వ్యాప్తి నియంత్రణకు శ్రమ పడుతున్నారు కాబట్టి ఒకవేళ ఎవరైనా విధినిర్వహణలో కోవిడ్ 19 వ్యాధి కారణంగా చనిపోతే వారికి 30 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.


హర్యానా రాష్ట్రం కంటే ముందే పంజాబ్రాష్ట్రం కూడా కరోనా వైరస్ని అదుపులోకి తెచ్చేందుకు రేయింబవళ్ళూ శ్రమపడుతున్న పోలీస్వైద్య సిబ్బంది కి 50 లక్షల రూపాయలహెల్త్ఇన్సూరెన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం కూడా తాను ప్రకటించిన రూ. లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీలో కరోనా వ్యాప్తి నిర్మూలన కొరకై ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కి రూ. 50 లక్షలహెల్త్ఇన్సూరెన్స్ ని కల్పించింది.
]]>

Viewing all articles
Browse latest Browse all 305672

Trending Articles