Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

చంద్ర‌బాబుకు రెస్ట్ అవ‌స‌రం...క్వారంటైన్‌లో కొన‌సాగాల్సిందే....!

$
0
0
చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని ఏపీమంత్రిమోపిదేవివెంకటరమణ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైసీపీప్ర‌భుత్వం కరోనా  కట్టడికి ఎంతో ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంద‌ని అన్నారు. అయితే అన‌వ‌స‌రంగా, స్వార్థ‌పూరిత రాజ‌కీయాల కోసం చంద్ర‌బాబు రాజ‌కీయం చేయాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు హోం క్వారంటైన్‌లో కూర్చుని అసత్యాలు ప‌ల‌క‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. కరోనా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే సోకినట్లు ఆయన తెగ‌ బాధ పడిపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు లేఖలు రాయడం మాని సంతోషంగా రెస్ట్‌ తీసుకోవాలని కౌంట‌ర్ ఇచ్చారు.

హైదరాబాద్‌లో కూర్చుని వీడియో కాన్ఫరెన్స్‌, టెలీ కాన్ఫరెన్స్‌ల పేరుతో విమర్శలు చేయడం సరికాదని.. ఏదైనా ఉంటే ఆయన ఏపీకి వచ్చి మాట్లాడాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోకి రావాలంటే ఆయన తెలంగాణప్రభుత్వం అనుమతి తీసుకోవాలని.. ఆ పత్రం తో ఏపీవచ్చినా 14 రోజుల పాటు క్వారంటైన్‌కు వెళ్లాలి అన్నారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుంద న్నారు.కరోనా వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రివైఎస్‌ జగన్‌ రోజూ సమీక్షలు చేస్తున్నారన్నారని.. ఇలాంటి కష్ట కాలంలోనూప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు.  చంద్రబాబు తెలంగాణలో ఉంటూ.. ఆంధ్రప్రదేశ్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి దుయ్య‌బ‌ట్టారు.  



ప్రపంచానికి కరోనా సోకితే చంద్రబాబుకు నీచ రాజకీయ వైరస్ సోకిందని మ‌రో మంత్రి\ ఆదిమూలపు సురేష్ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చ‌ంద్ర‌బాబు ప్ర‌తి విష‌యాన్ని రాజ‌కీయం చేస్తున్నారని.. క‌రోనాను వదిలేసి తమ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారన్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.  వైరస్‌ నియంత్ర‌ణ కోసం సీఎం జగన్చ‌ర్య‌లు తీసుకుంటుంటే మాస్కులు, కిట్లు లేవ‌ని నింద‌లు వేయ‌డం ఏంట‌ని అన్నారు. ప్ర‌భుత్వం కరోనాను కట్టడి చేస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు హోం క్వారంటైన్‌లో కూర్చుని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు మంత్రికన్నబాబు. ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు చంద్ర‌బాబుకు క‌నిపించ‌క‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని  అన్నారు.




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


apple : https://tinyurl.com/NIHWNapple


]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles