చిరంజీవిసినిమాల్లో రాణించి సుస్థిర స్థానం ఏర్పరచుకున్న తర్వాత నాగబాబును నిర్మాతగా, నటుడిగా రాణించేందుకు అవకాశం కల్పించారు. నాగబాబుకు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మించే బాధ్యతలను అప్పగించారు. అక్కడి నుంచి నాగబాబు సినీ పరిశ్రమలో ఎదిగారు. వ్యక్తిగతంగా లా చదువు చదువుకున్న అన్న అడుగుజాడల్లోనే నడిచారు. ఇక పవన్ కల్యాణ్సంగతి ప్రత్యేకించి చెప్పే అవసరం లేదు. తమ్ముడి బాధ్యతను చిన్నప్పటి నుంచే తీసుకుని పవన్కు ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ లో తర్ఫీదును ఇప్పించారు. సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. అన్న అడుగుజాడల్లో హీరోగా వచ్చి ఆ అన్న అభిమానుల అండదండలతో పవన్ఉన్నత శిఖరాలకు ఎదిగిపోయాడు. పవన్ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అది చిరంజీవిఅన్నగా నిర్వర్తించిన బాధ్యత అని చెప్పాలి.
తన ఇద్దరు చెల్లెళ్ల బాధ్యత కూడా తీసుకున్నారు చిరంజీవి. వారిద్దరి కోసం రౌడి అల్లుడు, అన్నయ్యసినిమాలు తీశారు. సాయిరాం ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాను నిర్మించి లాభాలను పూర్తిగా వారికే ఇచ్చేశారు. చిరంజీవిహైదరాబాద్లో స్థిరపడ్డాక వారిద్దరినీ అక్కడికే రప్పించుకుని ఇళ్లు కట్టించి అన్నగా బాద్యత నెరవేర్చారు. అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా చిరంజీవికుటుంబ పెద్దగా అందరికీ ఆదర్శంగా నిలిచారనడంలో సందేహం లేదు.
]]>