ఏదో వచ్చిన ప్రతి సినిమానీ చెయ్యకుండా హిట్ లేనప్పుడు , రానప్పుడు అసలు ఫ్లాప్ అవ్వడానికి గల రీజన్స్ ఎనలైజ్ చేసుకుంటూ తెలివైన స్టెప్స్ వేస్తున్నాడు. చిరంజీవిఅల్లుడిగా, అరవింద్కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ లో కూడా తనకంటూ క్రేజ్ ని, ఇమేజ్ ని సంపాదించుకుని కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నాడు .
బన్నీ.. కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ మూవీగంగోత్రిచూసి.. అసలు హీరోఅని ఎవరైనా అంటారా అన్న కామెంట్స్ నుంచి హీరోఅంటే వీడు అనిపించుకున్నాడు. ఎప్పటి కప్పుడు మేకోవర్ అవుతూ తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు . టాలీవుడ్కి తన మార్క్ స్టైల్ స్టేట్ మెంట్స్ ని ఇస్తూ.. అందరిలో స్పెషల్ అనిపించుకుంటున్నాడు .
అలవైకుంఠపురంలో సినిమాలో బ్లాక్ బస్టర్సక్సెస్కొట్టాడు బన్నీ. అయితే ఈ సక్సెస్కి ముందు దాదాపు సంవత్సరంన్నరకు పైగానే గ్యాప్ తీసుకున్నాడు. వరుసగా వస్తున్న ఫ్లాపుల నుంచి సొల్యూషన్ వెతుక్కున్నాడు. ఆడియన్స్పల్స్ పట్టుకున్నాడు. అదే స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్అందుకున్నాడు . అల్లు అర్జున్ఫస్ట్ నుంచి తన ఈజ్ తోనే ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాడు. ఎంత పెద్ద స్టార్ అయినా సింపుల్ గా ఉండే ఆ డైలాగ్ డెలివరీ, స్టోరీసెలక్షన్ తో పడేశాడు ఫ్యాన్స్ ని.
జులాయి గా ఇంటెలెక్చువల్ గా కనిపించినా, బధ్రినాథ్‌లో రెలిజియస్ ఎమోషన్స్ చూపించినా, సన్ ఆఫ్ సత్యమూర్తిలో సెంటిమెంట్ తో టచ్ చేసినా.. నాపేరు సూర్యనా ఇల్లు ఇండియాలో టఫ్ కాప్ గా అగ్రెసివ్ గా యాక్టింగ్ చేసినా.. అన్నింటికీ యాప్ట్ అనిపించాడు బన్నీ. ఇప్పుడు సుకుమార్సినిమాలో పుష్ప గా కనిపిస్తున్న లుక్ లో కూడా మాస్క్రౌడ్ ని టార్గెట్ చేసి మరో హిట్ ని అకౌంట్ లో వేసుకుందామనిప్లాన్ చేస్తున్నాడు.
]]>