తండ్రికి ఎప్పటికప్పుడు చేదోడు వాదుడుగా ఉంటూ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపుతు ప్రతి గ్రామం, పట్టణం తిరుగుతూ సమావేశాలు, ఉద్యమాలు చేస్తూ ముందుకు సాగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కవితనిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి అఖండ విజయం సాధించి పార్లమెంట్లో తెలంగాన సత్తా ఏంటో చాటారు. మహిళా నేతగా.. తండ్రికి కూతురిగా.. అన్నయ్యకు సోదరిగా ఆమె అన్ని రకాల బాధ్యతలు నెరవేరుస్తూ.. తెలంగాణబతుకమ్మ పండుగవస్తే అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కల్వకుంట్ల కవిత. ఇక కేటీఆర్విషయానికి వస్తే.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేటీఆర్వ్యూహాలు ఆ పార్టీగెలుపునకు పునాధులు వేశాయంటే అతిశయోక్తి లేదు. ఆ మద్య మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చేసిన కృషికి క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.
ఇలా రాజకీయాల్లో తండ్రికి వెన్నుదన్నుగా నిలుస్తూ.. రాజకీయ నాయకుల ప్రశంసలు పొందుతూ.. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్నారు కేటీఆర్. ఐటీశాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు.. తెలంగాణను ప్రపంచ స్థాకిలో గుర్తింపు వచ్చేలా చేశారు. ఇలా తెలంగాణముఖ్యమంత్రికేటీఆర్బిడ్డలుగా రాజకీయాల్లో తమ సత్తా చాటుతున్నారు అన్నా చెల్లెల్లు కేటీఆర్ - కల్వకుంట్ల కవిత. ఇక ఈ ఇద్దరు అన్నాచెల్లెలు... ఎప్పుడూ అనురాగంతో కలిసిమెలిసి ఉంటారు. ఎలాంటి వేడుకలు, పండగలు వచ్చినా.. ఒకొరికొకరు అప్యాయంగా పలకరించుకొని శుభాకాంక్షలు చెప్తుంటారు.
]]>