ఇక ఎన్టీఆర్పార్టీపెట్టినప్పుడు చైతన్య రథం నడిపిని హరికృష్ణ పార్టీకోసం నిస్వార్థంగా సేవలు చేసేవారు. ఇక ఎన్టీఆర్తన రాజకీయ వారసుడిగా బాలకృష్ణ పేరు చెప్పినా చంద్రబాబు ఒత్తిడి తెచ్చి మరీ ఆ మాటను ఉపసంహరించుకునేలా చేశారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు పదవి నుంచి దింపేశాక హరికృష్ణ రవాణా శాఖా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1999లో చంద్రబాబు హరికృష్ణను పక్కన పెట్టడంతో చివరకు హరికృష్ణ అన్న తెలుగుదేశం స్థాపించి గుడివాడనుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయన ఓడిపోవడంతో పాటు ఓవరాల్‌గా స్టేట్‌లో కూడా పార్టీఓడిపోయింది.
ఆ తర్వాత హరికృష్ణ - బాలకృష్ణ మళ్లీ దగ్గర అయ్యారు. అయితే విభజించి పాలించే చంద్రబాబు చివరకు బాలకృష్ణ కుమార్తెను తన కుమారుడికి చేసుకుని మిగిలిన వారసులను వ్యూహాత్మకంగా పక్కన పెట్టారు. ఈ పెళ్లిజరిగేంత వరకు కూడా హరికృష్ణ - బాలయ్య మధ్య మంచి సంబంధాలే ఉండేవి. ఆ తర్వాత హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్సినిమాల్లో స్టార్ హీరోఅవ్వడంతో మళ్లీ అది సినిమా, రాజకీయ రంగాల్లో కంటగింపుగా మారింది. చివరకు ఎన్టీఆర్పెళ్లితానే చేశానని బిల్డప్ ఇచ్చుకున్నారు.
ఎన్టీఆర్‌ను ఎన్నికల్లో ప్రచారానికి వాడుకున్నారు. చివరకు హరికృష్ణ మరణం తర్వాత కూడా ఆ సానుభూతిని వాడుకోవాలని ఆయన కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లిలో పోటీ చేయించి ఓడేలా చేశారు. ఆ తర్వాత బాలయ్య - ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ మళ్లీ దగ్గరైనా ఎన్నికల ప్రచారానికి మాత్రం ఈ అన్నదమ్ములు దూరంగానే ఉన్నారు. ఏదేమైనా బాలయ్య - హరికృష్ణ మధ్య ముందు నుంచి మంచి సంబంధాలు ఉండేవి. కానీ చంద్రబాబు విజభన రాజకీయంలోనే వీరి మధ్య గ్యాప్ వచ్చింది.