మరికొంత మంది తమకు కరోనా లక్షణాలు ఉన్నా.. పెద్దగా పట్టించుకోక చిన్న చిన్న వైద్యులను సంప్రదించి అప్పటికప్పుడు ఉపశమనం పొందినా.. తర్వాత సీరియస్ కావడంతో బయటకు వస్తున్నారు. తాజాగా జమ్మూలోని టిక్రీలో ఓ మహిళ కరోనాతో నిన్న ప్రాణాలు విడిచింది. అయితే 12 మంది ఆ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. వీరంతా ఉదంపూర్ కు చెందినవారు కాగా..వీరికి పరీక్షలు నిర్వహిస్తే నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు ఉదంపూర్ జిల్లాకమిషనర్ తెలిపారు.
కంటైన్ మెంట్ ప్రణాళిక కఠినంగా అమలు చేయడం జరుగుతుందని కమిషనర్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుల నేపథ్యంలో టిక్రీని రెడ్జోన్ గా ప్రకటించినట్లు చెప్పారు. . మరోవైపు జమ్మూకశ్మీర్ లో లాక్ డౌన్ తో రెక్కాడితే కానీ డొక్కాడనీ పేద ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులను భద్రతా బలగాలు, అధికారులు పంపిణీ చేస్తున్నారు.
]]>