అమెరికాలో నిన్న ఒక్కరోజే 30 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా నిన్న ఒక్కరోజే రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక యూరప్దేశాలు అయిన ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీదేశాలు చెప్పుకుంటూపోతే ఒకదాని తర్వాత ఒకటి ఆయా దేశాల్లో రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతుంది. ముక్యంగా ఇటలీ, స్పెయిన్, జర్మనీదేశాలలో కేసులు వేగంగా పెరుగుతాయి. బ్రిటన్ లోనే నిన్న ఒక్క రోజు 900 మంది ఏకంగా కరోనా సోకి ప్రాణాలు వదిలారు. ఇది చూస్తే అక్కడ పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచంలోని అన్ని దేశాలు వారివారి ప్రజల్ని కాపాడుకోవడానికి వారి సాయశక్తుల వారి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంకా అమెరికాలో కరుణ కేసులు ఐదు లక్షలకు దగ్గర్లో ఉన్నాయి. అలాగే స్పెయిన్లో కూడా కరోనా కేసులు లక్షన్నర వరకు రాసాగాయి. అయితే జర్మనీదేశం విషయానికి వస్తే అక్కడ మరణాల రేటు తక్కువగా ఉన్న అక్కడ కూడా లక్ష వరకు కేసులు నమోదయ్యాయి. జర్మనీలో ఇప్పటికీ రోజుకి మూడు నుంచి ఆరు వేల కేసులు కొత్తగా చేరుతున్నాయి. అయితే అన్ని దేశాలకంటే అమెరికాలో మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇరాన్లో కూడా భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇలానే అన్ని దేశాల్లో పరిస్థితి ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ ప్రకటించిన కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇదే పరిస్థితి ఒక రెండు మూడు వారాలు సాగితే మాత్రం ప్రజలు వారు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని పలువురు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
]]>