అందంగా ఉండాలి అని అందరికి ఉంటుంది.. కానీ మన బిజీ జీవితంలో అందం కోసం సమయం కేటాయించడానికి అవకాశం ఉండదు. ఇంకా ఈ నేపథ్యంలోనే మెడపై మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. దుమ్ము, దూళి కారణంగా అది నల్లగా మారిపోతుంది. అలాంటి సమయంలో మెడ తెల్లగా మారడానికి ఈ చిట్కాలు పాటించండి.
నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి మెడమీద రుద్దుకుని 5 లేదా 10 నిమిషాల తరువాత కడిగేయండి.. ఇలా చెయ్యడం వల్ల మృతకణాలు తొలిగిపోతాయి.
స్పూన్ నిమ్మరసంలో స్పూన్ దోసకాయ రసం కొద్దిగా గంధం కలిపి పేస్ట్ లా తయారు చేసి ఆ మిశ్రమాన్ని మెడమీద రాసుకుంటే మెడమీద నలుపు త్వరగా మాయం అవుతుంది.
స్పూన్ గంధంలో కొద్దిగా రోజ్‌వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని రాత్రివేళ మెడకు పట్టించి కడిగేస్తే మీద తెల్లగా మారుతుంది.
నిమ్మరసంలో కొద్దిగా పసుపు కలిపి పెట్టుకున్నా మెడ తెల్లగా మారుతుంది.
ఆలుగడ్డను ముక్కలుగా కోసుకుని రెండు వారాలకోసారి మెడ మీద రుద్దుకుంటే అందంగా తయారవుతుంది.
]]>