Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305735

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పవన్ ప్రత్యర్థి దూకుడు అలాగే ఉందా?

$
0
0
2019ఎన్నికల్లో సంచలనమైన విషయం ఏదైనా ఉందంటే....అది ఎంతో క్రేజ్ ఉన్న జనసేనఅధినేత పవన్కళ్యాణ్పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీఅభ్యర్థులు పవన్ని చిత్తుగా ఓడించారు. అయితే ఇందులో ఊహించని విజయం ఎవరికైనా దక్కిదంటే అది భీమవరం అభ్యర్థికే. ఇక్కడ పవన్ఖచ్చితంగా గెలుస్తారని అంతా అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా గ్రంథి శ్రీనివాస్...ఇటు పవన్కళ్యాణ్ని, అటు టీడీపీఅభ్యర్థి పులపర్తి అంజిబాబుని ఓడించి సత్తా చాటారు. ఇక గ్రంథి శ్రీనివాస్ 2004లో కాంగ్రెస్నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత వైసీపీలోకి వచ్చి 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.



ఇక ఓడిపోయినా మళ్ళీ కష్టపడుతూ దూకుడుగా నియోజకవర్గంలో పని చేసుకున్నారు. ఫలితంగా 2019ఎన్నికల్లో పవన్కళ్యాణ్ప్రత్యర్థిగా ఉన్న చిత్తుగా ఓడించారు. అయితే గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్దూకుడుగా పని చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.



ఏ విషయంలోనైనా సమస్య ఉందని వచ్చే ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఇక ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు అందేలా చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో తన నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా కృషి చేస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న ప్రజలని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.



అయితే గ్రంథి శ్రీనివాస్అన్ని వర్గాల ప్రజలని కలుపునే ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే గ్రంథి ఎక్కువగా షాప్ ఓపెనింగ్స్, ఏమైనా ఫంక్షన్లకు ఎక్కువ వెళతారని దాని వల్ల ప్రజలకు పెద్దగా ఒరిగిదేమి లేదని అంటున్నారు. కాకపోతే అధికార నేతగా గ్రంథి దూకుడుగానే ఉంటున్నారు. ప్రతిపక్షాలు జనసేన, టీడీపీలకు చెక్పెట్టడంలో ముందే ఉంటున్నారు. మొత్తానికైతే గ్రంథి పనుల్లో దూకుడు కంటే ప్రతిపక్షాలని కట్టడి చేయడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305735

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>