కరోనా వైరస్‌తో ఐటీ దిగ్గజం బిల్‌గేట్స్‌కు ఏమైనా సంబంధం ఉందా..? వైరస్‌లకు వ్యాక్సిన్ల తయారీ విషయంలో బిల్‌గేట్స్‌కు ఎందుకంత ఇంట్రెస్ట్..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరి మెదళ్లను తొలుస్తున్నాయి. 2015లో జరిగిన టెడ్ టాక్ సమావేశంలో బిల్‌గేట్స్ ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఇప్పుడు మనం ఆయుధాలపైన కాకుండా.. వైరస్ మహమ్మారులకు వ్యాక్సిన్లను కనిపెట్టడంపై దృష్టిసారించాలని, ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని సూచించారు. ఈ మేరకు తమ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పెద్దమొత్తంలో నిధులను వ్యాక్సిన్ల తయారీ కంపెనీలకు సమకూర్చుతోందని చెప్పారు. అయితే.. నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టేసిన సమయంలో నాడు బిల్‌గేట్స్ చెప్పిన విషయాలను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అసలు కరోనా వైరస్‌కు, బిల్‌గేట్స్‌కు ఏదో రిలేషన్ ఉందని అనుమానిస్తున్నారు. ఒక దశలో వైరస్‌ను తయారు చేసింది కూడా బిల్‌గేట్సేనని డౌట్ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన సీసీటీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
]]>
2015లో ఆఫ్రికాలో పుట్టిన ఎబోలా వైరస్‌తో వేలాదిమంది చనిపోయారని, ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల తయారీ ఎంత అవసరమే గుర్తించామని అన్నారు. ఇప్పుడు ప్రపంచానికి ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా వ్యాక్సిన్ అందించడమే మన లక్ష్యంగా ఉండాలని అన్నారు. ఇదే సమయంలో ఒక దేశం కోసమో.. ఒక ప్రాంతం కోసమే వ్యాక్సిన్ తయారు చేయలేమని, మొత్తం ప్రపంచం కోసం తయారు చేయాలని, ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారికైనా వ్యాక్సిన్‌ను అందుబాబులో ఉంచడమే లక్ష్యంగా మనం ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ టీకా అందించడమే గేట్స్ ఫౌండేషన్ ధ్యేయమని ఆయన చెప్పారు. ఇక కరోనా వైరస్‌పై చైనా విజయం సాధించిందని, ఆ మహమ్మారికి తొందరగానే అడ్డుకట్టవేసిందని ఆయన పేర్కొన్నారు. కంటికి కనిపించని శత్రువును సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు.
]]>