Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

గుడ్ న్యూస్‌: 16002 క‌రోనా ప‌రీక్ష‌లు.. 0.2 శాతం పాజిటివ్ కేసులు

$
0
0
క‌రోనా వ్యాప్తి విష‌యంలో ప్ర‌పంచ దేశాల‌తో పోల్చితే భార‌త్‌లో సంక్ర‌మ‌ణ రేట్ చాలా త‌క్కువే. అంతేగాకుండా.. వైర‌స్ బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా చాలా ఆశాజ‌నకంగా ఉంటుంది. ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ లేకున్నా.. అందుబాటులో ఉన్న వైద్య చికిత్స‌ల‌తో మ‌న డాక్ట‌ర్లు చాలా వ‌ర‌కు చెక్పెడుతున్నారు. మ‌రోవైపు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా లాక్‌డౌన్‌తో దాదాపుగా వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట‌వేశాయ‌నే చెప్పొచ్చు. సుమారు 130కోట్ల జ‌నాభాలో కేవ‌లం రోజుకు నాలుగైదు వంద‌ల్లోనే పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌డం గ‌మ‌నార్హం. అందికూడా ఢిల్లీమ‌ర్క‌జ్ జ‌మాత్ కార‌ణంగా అనూహ్యంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగాయి త‌ప్ప మిగ‌తా సంక్ర‌మ‌ణ రేట్ మాత్రం చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు ఇప్ప‌టికే అంత‌ర్జాతీయంగా ప్ర‌శంస‌లు అందుతున్నాయి భార‌త్‌కు. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం సాయంత్రం కేంద్రఆరోగ్య శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించారు. 

 క‌రోనా వైర‌స్ సంక్ర‌మ‌ణ రేటు భార‌త్‌లో త‌క్కువ‌గానే ఆయ‌న‌ తెలిపారు. గురువారం రోజున సుమారు 16002 క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు చెప్పారు.  వీటిల్లో కేవ‌లం 0.2 శాతం మాత్ర‌మే పాజిటివ్ కేసులు ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు.  శ్యాంపిళ్లు సేక‌రించిన ఆధారంగా, ఇన్‌ఫెక్ష‌న్ రేటు పెద్ద‌గా లేద‌ని అగ‌ర్వాల్ తెలిపారు.  రాపిడ్ డ‌యాగ్న‌స్టిక్స్ కిట్స్‌ను అంద‌రికీ పంపిణీ చేశామ‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎటువంటి కమ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ జ‌ర‌గ‌లేద‌న్నారు. ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం అంత‌క‌న్నా లేద‌ని తెలిపారు. అయినా నిరంత‌రం అప్ర‌మ‌త్తంగానే ఉండాల‌ని చెప్పారు. అలాగే.. మ‌న‌దేశంలో కావాల్సినంత హైడ్రాక్సీక్లోరోక్విన్ నిల్వ‌లు ఉన్న‌ట్లు కేంద్రవిదేశాంగ‌శాఖ కోఆర్డినేట‌ర్ ద‌మ్ము ర‌వి తెలిపారు. చాలా వ‌ర‌కు దేశాలు ఆ డ్ర‌గ్ కావాలంటూ విజ్ఞ‌ప్తులు చేస్తున్నాయ‌ని, కానీ మ‌న‌కు కావాల్సినంత మ‌న ద‌గ్గ‌ర ఉంచుకుని, ఇత‌ర దేశాల‌కు అవ‌స‌రం మేర‌కు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. 




]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>