Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

ఎస్ఈసీ రమేష్‌ను సాగ‌నంపేందుకు జగన్ ఆర్డినెన్స్ అస్త్రం...?

$
0
0
ఆంధ్రప్రదేశ్‌లో స్థానికసంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ చీఫ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ రమేష్ కుమార్నిర్ణయం తీసుకోవడడం రాష్ట్రంలో పెను సంచలనానికి దారి తీసిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగించేందుకు వైఎస్ జగన్ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్తన సామాజిక వర్గం నేత అయిన చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారంటూ సీఎం జగన్సంచలన ఆరోపణలు చేయ‌డంతో ఈ విష‌యం మ‌రింత రాజ‌కీయ రంగు పులుముకుంది.  ఎస్ఈసీకి కూడా కులం అంటగడతారా అంటూ ప్రతిపక్షాలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై, ఆయ‌న ప్ర‌భుత్వం, మంత్రివ‌ర్గంపై  మండిపడ్డాయి.


ఆర్డినెన్స్ ద్వారా ఆయనను ఇంటికి పంపేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా ప్ర‌భుత్వం పెద్ద‌ల నుంచి మాట‌లు విన‌బ‌డుతున్నా యి.  అందుకోసం ఆంధ్రప్రదేశ్పంచాయతీరాజ్ చట్టం - 1994లో మార్పులు తీసుకొచ్చేందుకు సైతం కసరత్తు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఇదే విష‌యంపై  ఆంగ్ల దిన ప‌త్రిక ది న్యూ ఇండియన్ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ కథనాన్ని ప్రచురించింది. ఎలక్షన్ కమిషనర్ నియామకం ప్రక్రియ, పదవీ కాలం, అర్హతలను మార్చే అవకాశం ఉంద‌ని క‌థ‌నంలో పేర్కొంది.  ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రిన్సిప‌ల్ సెక్రటరీ స్థాయి, ఆ పై అధికారిని మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించడానికి అర్హ‌త క‌లిగి ఉంటారు. 



జగన్ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చే ఆర్డినెన్స్ ద్వారా హైకోర్టు జడ్జిగా పనిచేసిన వారికి మాత్రమే ఎస్ఈసీగా పనిచేసే అవకాశం ఉంటుంద‌ని తెలుస్తోంది.   రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ ఎలాంటి పక్షపాతం లేకుండా ఉండేందుకే ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకువ‌స్తున్న‌ట్లుగా  వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు ఎస్ఈసీ పదవీకాలం అంశంలో కూడా మార్పులు చేర్పులు ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప‌ద‌వీకాలాన్ని కూడా మూడు సంవత్సరాలకు తగ్గించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం కరోనా వైరస్నేపథ్యంలో మంత్రులు అందరూ తమ తమ జిల్లాల్లో ఉన్నారు. ఈ అంశంపై వారి అభిప్రాయాన్ని త్వరగా తెలియజేయాలని మంత్రులను ముఖ్య‌మంత్రి ఆదేశించిన‌ట్లు స‌మాచారం.




క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


apple : https://tinyurl.com/NIHWNapple


]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>