Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ నేతకు కరోనా పాజిటివ్... ఎక్కడంటే...?

$
0
0
దేశంలో కరోనా వైరస్వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఈ కరోనా మహమ్మారికి ధనిక, పేద, కుల, మత భేదాలు లేవు. కొన్ని దేశాలలో ఏకంగా ప్రధాన మంత్రులే కరోనా భారీన పడ్డారంటే ప్రపంచ దేశాలలో కరోనా ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కరోనా వైరస్కాంగ్రెస్నేతకు కూడా సోకింది. 
 
దేశంలో దాదాపు 6,500 మంది కరోనా భారీన పడగా 200 మంది మృతి చెందారు. రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఢిల్లీకి చెందిన మాజీ కాంగ్రెస్ఎమ్మెల్యేకరోనా భారీన పడ్డారు. మాజీ ఎమ్మెల్యేభార్యకు, కూతురుకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. ఆయన కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశాలకు హాజరయ్యాడు. ఆ సమయంలోనే ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. 
 
కొన్ని రోజుల క్రితమే కరోనా లక్షణాలు కనిపించినా మాజీ ఎమ్మెల్యేసమాచారం ఇవ్వలేదు. పోలీసులు కరోనా సోకినా దాచిపెట్టడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఢిల్లీప్రభుత్వం మాజీ ఎమ్మెల్యేఉన్న ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా ప్రకటించింది. అధికారులు మాజీ ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు ఎవరెవరిని కలిశారనే విషయాలను సేకరిస్తున్నారు. ఎమ్మెల్యే, అతని కుటుంబ సభ్యులు కలిసిన వారిని ముందస్తు చర్యల్లో భాగంగా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. 
 
మరోవైపు ఏపీ, తెలంగాణరాష్ట్రాలలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణలో 473 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో 365 కేసులు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల సీఎంలు కొత్త కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నా పూర్తి స్థాయిలో కరోనా కట్టడి కావడం లేదు. మరోవైపు కేంద్రం రెండు వారాలు లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>