చదువు లేని పిల్లలు క్రీడల్లో అయినా రాణించి వారి సత్తా ఏంటో చాటుకుంటారు.. ఇంకా మరికొంతమంది పిల్లలు తల్లి తండ్రుల బలవంతం కారణంగా టీవీముందు కూర్చొని పుస్తకాలు తెరిచి చదివినట్టు నటిస్తారు. మరికొంతమంది పిల్లలకు ప్రశాంతంగా ఉన్న చోటు లేక చదవలేకపోతుంటారు.. అలాంటి వారికీ ప్రశాంతవంతమైన చోటును ఏర్పాటు చెయ్యాల్సిన బాధ్యత తల్లి తండ్రులదే.
ఇంకా కొంతమంది పిల్లలు చదువుకో నానా అంటే.. ఎప్పుడో జరిగిన చిరాకు నెగటివ్ ఆలోచనలు చేస్తుంటారు. ఈ ఆలోచనల కారణంగా చదివిన ఏవి గుర్తు ఉండవు. అందుకే నెగటివ్ ఆలోచనలు చెయ్యకుండా ఉండేలా తల్లితండ్రులే మంచి మాటలు చెప్పి వారిని చదువుకునేలా చెయ్యాలి.
ఇంకా పిల్లలు ఏదైనా తెలుసుకునే సమయంలో సందేహాలు వస్తే స్నేహితులతో లేదా తల్లితండ్రులతో చేర్చించి సందేహాలు తీర్చుకునేలా వారికీ అలవాటు చెయ్యాలి. గ్రూప్ స్టడీ చేస్తే కష్టమైన సబీజెక్టు కూడా ఇష్టంగా ఉంటుంది. అయితే ఈ స్టడీలో మాటలు కాకుండా కేవలం కష్టమైన ప్రశ్నల గురించి మాత్రమే చర్చిస్తే జవాబులు అన్ని గుర్తుంటాయి. ఇలా ఈ సూచనలు పాటించి క్లాస్ ఫస్ట్ వచ్చేయండి.
]]>