Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

ఇకపై కరెన్సీ నోట్లతో నో టెన్ష‌న్‌.. శుద్ధి చేసే సరికొత్త మిషన్ వ‌చ్చేసింది..!!

$
0
0
ప్రస్తుతం ఎక్కడ చూసినా అందరి మాట వినపడేది ఒకటే మాట కరోనా.. కరోనా.. ఈ కరుణా మహమ్మారి వల్ల వేల మంది మృత్యువాత పడగా 16 లక్షల పైగా బాధితుల సంఖ్య నమోదయింది. ఇక కరోనా వైరస్ను అరికట్టేందుకు అన్ని దేశాలు కూడా పోరాటాలే చేస్తున్నాయి అంటే నమ్మండి. ఇందులో భాగంగానే చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇలా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇక మరోవైపు కరెన్సీనోట్ల వల్ల ప్రజలందరిలో కొత్త తరహా టెన్షన్ ఏర్పడింది అంటే నమ్మండి.


అంతే కాదండోయ్... సోషల్ మీడియాలో వైరస్ వ్యాప్తి చేస్తున్నామంటూ కొంతమంది కరెన్సీనోట్లకు ఉమ్మి రాస్తూ, ముఖానికి ముక్కుకు రాసుకుంటున్నట్లు వీడియోలు చాలా వైరల్ మారాయి. ఇక దీని వల్ల కరెన్సీనోట్లు ముట్టుకుంటే కరోనా వైరస్వస్తుందేమో అన్న భయంతో చాలామంది డబ్బులు తీసుకోవడం లేదు. ఈ తరహా టెన్షన్ ఇక నుంచి పడవలసిన అవసరం లేదు అని ప్రముఖ సంస్థ పేర్కొంటోంది. ఎందుకంటే ఐఐటి రోపార్ ఒక అద్భుతమైన పరికరాన్ని కనుగొనింది. ఈ పరికరంలో కూరగాయలు కరెన్సీనోట్లు సెల్ ఫోన్లు ఇలా అన్ని రకముల వస్తువులను పెడితే ఆ పరికరం మొత్తం వస్తువులు అన్నిటిని కూడా కరోనా రహితంగా మారుస్తుంది అని తెలిపారు. ఇంకా ఈ పరికరంలో అల్ట్రా వైలెట్ జర్నీసాండిల్ ఇదే టేషన్టెక్నాలజీవాడారు. 




వాస్తవానికి ఈ టెక్నాలజీలో మనం శుభ్రపరచాలి అన్న చిన్న వస్తువు ఏదైనా పెడితే అల్ట్రా వైలెట్ కిరణాలు ప్రసారమవుతాయి. ఇలా ప్రసారం అవ్వడంతో వస్తువుల పై ఉన్న క్రీములు నాశనం అవుతాయని సంస్థ తెలియజేసింది. ఇక ఈ పరికరం ధర విషయానికి వస్తే 500 రూపాయల కంటే తక్కువగానే ఉంటుందట. ఇక ఒక్కసారి వస్తువును శానిటైజేషన్ చేయాలంటే 30 నిమిషాల టైం పడుతుంది అని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ శానిటైజేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎవరూ కూడా లోపలికి చూడకూడదు అని ఇలా చూడడం ద్వారా ప్రమాదకర కిరణాలు ప్రసరిస్తాయి అని. అది కంటికి చాలా ప్రమాదమని వారు తెలిపారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>