Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

కన్నడంలో రిమేక్ చేస్తున్న అడవి శేషు ‘ఎవరు’... హీరో ఎవరో తెలుసా?

$
0
0
టాలీవుడ్లో ఇప్పుడు యంగ్ హీరోల హవా కొనసాగుతుంది.  చిన్న చిన్న పాత్రల్లో నటించిన వారు ఇప్పుడు హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.  క్షణం, గూఢచారిలాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడవి శేష్. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ కోసం  ప్రయత్నిస్తూ మంచి సక్సెస్అందుకుంటున్నాడు అడవి శేషు.  ఇటీవల అడవి శేషు, నవీన్ చంద్ర, రెజీనా కసండ్ర కాంబినేషన్ లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్స్‌ మూవీ‘ఎవరు’.  అనుకోని పరిస్థితుల్లో రెజీనా మర్డర్కేసులో ఇరుక్కుంటుంది.

నవీన్ చంద్రను చంపేసిన కేసులో ఆమెను కిల్లర్ గా ముద్ర వేస్తారు పోలీసులు. అయితే ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ఆఫీసర్ అడవి శేష్. డబ్బు కోసం సాక్ష్యాలను తారుమారు చేయడానికి.. రెజీనాకు సాయం చేయడానికి వస్తాడు శేష్. అప్పటికే తాను ఓ కేసు డీల్ చేస్తుంటాడు.. దీనికి రెజినా, నవీన్ చంద్ర, మురళీ శర్మమర్డర్విషయం అంతర్లీనంగా ఉండటంతో కేసు వేరే కోణంలోకి వెళ్తుంది.  చివరికి నవీన్ చంద్రను రెజీనా ఎందుకు చంపింది అనేది అసలు.. మురళీ శర్మహంతకులు ఎవరు అన్నది కథ. ఈ మూవీటాలీవుడ్లో సూపర్ సక్సెస్కావడంతో ఇప్పుడు కన్నడలో రీమేక్చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.తెలుగులో అడివి శేష్ పోషించిన పాత్రను కన్నడలో 'దిగంత్' చేయనున్నాడు.



ఇక రెజీనా పాత్రకి ఎవరిని ఎంపిక చేయనున్నారనేది చూడాలి. తెలుగు సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే కన్నడసినిమాకి కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.  ఇక అడివి శేష్ విషయానికొస్తే, మహేశ్బాబు నిర్మాణంలో ఆయన 'మేజర్' సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.  ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడింది.  తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ మూవీమరి కన్నడంలో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి. 

]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>