చిరంజీవిఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. పవన్కళ్యాణ్కుమారుడు... అకీర్ నందన్ ని సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ బాధ్యతను ఆయన రామ్ చరణ్‌కి అప్పగించారు అంటున్నారు. రామ్ చరణ్అకీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటున్నారు. తానే నిర్మాతగా మంచి దర్శకుడి దర్శకత్వంలో సినిమాల్లోకి తన తమ్ముడ్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని...
అకీర్ ని హీరోగా పరిచయం చేసే సినిమాలో తాను కూడా ఉండాలని చిరంజీవిభావిస్తున్నారని అంటున్నారు. పెద్దగా తాను సినిమాలో ఉంటే అకీర్ కి ధైర్యం ఉంటుంది అని చిరంజీవిభావిస్తున్నారని అంటున్నారు. సినిమావిషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పవన్‌కళ్యాణ్‌కి కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టు సమాచారం. చిన్న చిన్న విషయాలను కూడా ఆయన పట్టించుకుని ఈ సినిమాను ముందుకు తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో ఆయన కనిపించాడు. ఇప్పుడు చేసే సినిమాల విషయంలో తన తండ్రి, చిరంజీవిసలహాలను తీసుకోవాలని చూస్తున్నాడు.
]]>