Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

తెలంగాణ ప్రజలకు శుభవార్త..... లాక్ డౌన్ వేళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం....?

$
0
0
తెలంగాణరాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్నటివరకూ రాష్ట్రంలో 473 మంది కరోనా భారీన పడ్డారు. ప్రతిరోజూ రాష్ట్రంలో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. లాక్ డౌన్ అమలులో ఉండటంతో రాష్ట్ర ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించారు. 
 
ప్రభుత్వం 2019 - 2020ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్ను చెల్లింపులు ఎటువంటి జరిమానా లేకుండా రాబోయే మూడు నెలల్లో చెల్లించే అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్దీనికి సంబంధించిన ఫైల్ పై ఈరోజు సంతకం చేశారు. పట్టణ, స్థానికసంస్థల ప్రజలు ఆస్తి పన్ను రాబోయే మూడు నెలల్లో ఎటువంటి జరిమానా లేకుండా చెల్లించవచ్చు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రికేటీఆర్కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఆస్తి పన్ను కట్టించుకునే పద్ధతిని మెరుగుపరచాలని సూచించారు. 
 
స్థానిక సంస్థల కమిషనర్లు ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రిసూచించారు. పౌరులకు ఆన్‌లైన్‌ ద్వారా ఆస్తి పన్ను కట్టించుకునే పద్ధతిని ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలని మంత్రిసూచించారు. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి కార్యాలయానికి వస్తే వారి విషయంలో తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని.... పన్ను చెల్లించేవారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉండటంతో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గుతోంది. గతంలో తెలంగాణప్రభుత్వానికి రోజుకు 400 కోట్ల రూపాయల నుంచి 500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా ప్రస్తుతం కేవలం కోటిరూపాయలు మాత్రమే ఆదాయం సమకూరుతోంది. తెలంగాణప్రభుత్వం భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి రేపు జరగబోయే కేబినెట్భేటీలో చర్చించనుంది. రాష్ట్రంలో రేపు మధ్యాహ్నం కేబినెట్భేటీ జరగనుంది. 
 
 ]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles