Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

ఆ విషయం తన భర్తతో చెప్పుకోలేక నరకం అనుభవించానంటున్న మహేష్ బాబు హీరోయిన్ లీసా రే...

$
0
0
టాలీవుడ్సూపర్ స్టార్మహేష్బాబు కెరీర్ బిగినింగ్ లో నటించిన ‘టక్కరిదొంగ’ సినిమాగుర్తుంది కదా. ఒకప్పుడు హాలీవుడ్లో కౌబాయ్ సినిమాలకు యమా క్రేజ్ ఉండేది.  ఆ తర్వాత బాలీవుడ్, టాలీవుడ్లో కూడా ఈ తరహా సినిమాలు వచ్చాయి.  అయితే ఎక్కువగా కౌబాయ్ సినిమాల్లో సూపర్ స్టార్కృష్ణనటించారు.  చాలా కాలం తర్వాత మెగాస్టార్కొదమ సింహం సినిమాలో కౌబాయ్ గా కనిపించారు.  ఆ తర్వాత మహేష్బాబు ‘టక్కరిదొంగ’ మూవీలో కౌబాయ్ గా కనిపించారు.  ఈ మూవీలో మహేష్బాబు సరసన బాలీవుడ్అందాలభామ లీసా రే నటించింది.  ఆ తర్వాత ఆమె తెలుగు లో కనిపించలేదు.

అయితే  లీసా రే క్యాన్సర్బారినపడినా మొక్కవోని ధైర్యంతో పోరాడి ఆరోగ్యవంతురాలైంది. తాజాగా కరీనా కపూర్నిర్వహించే వాట్ ఉమెన్ వాంట్ అనే టాక్ షోలో లీసా రే  తాను క్యాన్సర్సమయంలో పడ్డ ఆవేదన.. నరకం గురించి తెలిపింది. పెళ్లయిన నెలకే క్యాన్సర్వ్యాధి తిరగబెట్టిందని, దాంతో నరకం చవిచూశానని తెలిపింది.  పెళ్లైన ఆనందం కూడా లేకుండా ఈ క్యాన్సర్తిరగబడటం.. ఈ విషయం నా భర్తజాసన్ డెహ్నీకి చెప్పలేకపోయాను.



వైవాహిక జీవితంతో సంతోషంగా ముందుకెళదాం, ఆ తర్వాత క్యాన్సర్సంగతి చూసుకోవచ్చని భావించాను. కానీ పెళ్లయిన నెలకే తప్పని సరి పరిస్థితిలో మళ్లీ ట్రీట్ మెంట్ కు వెళ్లాల్సి వచ్చింది  అని వెల్లడించింది. అయితే నాకు పెళ్లైన తర్వాత ప్రాణాంతకరమైన వ్యాధి క్యాన్సర్వచ్చినా.. నా అందమైన భర్తఎంతో ఆదరణ.. గుండెధైర్యాన్ని నింపారని అందుకే అంతటి ఘోర విపత్కర పరిస్థితి నుంచి బయట పడ్డానని అన్నారు. నన్ను పెళ్లిచేసుకున్నందుకు థ్యాంక్స్ బేబీ అంటూ కృతజ్ఞతలు తెలిపాను.   లీసా, జాసన్ డెహ్నీల వివాహం 2012లో జరిగింది. 2018లో వీరికి సూఫీ, సొలీల్ అనే కవలలు జన్మించారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>