అలాంటివి గమనించి దానికి తగినట్లు పార్టనర్‌తో నడుచుకుంటే ఆ సంసారం సుఖసంసారం అవుతుంది. అలాగే గర్భం వద్దనుకున్నపుడు వివిధ గర్భనిరోధక పద్దతులు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే మనస్సులో గర్భం వస్తుందేమో అన్న భయంతో చాలా మంది శృంగారాన్ని ఎంజాయ్ చెయ్యలేరు. అంతేకాక ఆ భయంతో ఇద్దరూ శృంగారంలో సరిగా పాల్గొనలేకపోవచ్చును. సెక్స్‌లో కొన్ని వాతంటవే కలిగినా కొన్ని నేర్చుకోవాల్సి వుంటుంది. అలాగే అంగస్తంభనాలు గర్భస్థ పిండానికి కూడా వాటంతటవే కలుగుతాయి. ఇక సెక్స్‌లో తృప్తి పొందడం, అలాగే వీర్యస్ఖలనంపై నియంత్రణ, భావప్రాప్తి అనేది ఎలా పొందడం ఇవి నేర్చుకోవాలి వీటి పై దృష్టిని కేంద్రీకరించాలి.
శృంగారంలో తృప్తినిచ్చే వాటిలో ఏవైతే మన శరీర అవయవాలు ఉన్నాయో అవి పరిశుభ్రతగా ఉంచుకోవడం చాలా ముఖ్యమే. వాత్సాయనుడు వ్యక్తిగత పరిశుభ్రత, చక్కని పరిసరాలు, సుఖంగా వుండే బెడ్‌రూమ్‌కు ప్రాధాన్యతనివ్వడం మంచిది. రతిక్రీడలో వస్త్రాలు లేకుండా ఒకరి శరీరాన్ని ఒకరు సాధ్యమైనంతసేపు ప్రేరేపించి అప్పుడు సెక్స్‌లో పాల్గొంటారు అలాంటప్పుడు వ్యక్తిగత శుభ్రత అన్నది చాలా ముఖ్యం. ఫోర్‌ప్లే అనేదిస్త్రీపురుషునికి కూడా చేయాలి. ఒంట్లో బాగుండనప్పుడు, మానసికంగా ఆందోళన లేదా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొన లేకపోవచ్చు. అలాంటప్పుడు పార్ట్‌నర్ ప్రేమానురాగాలు చూపడం ద్వారా ఆరోగ్యం కూడా చాలా తొందరగా కోలుకోవడం జరుగుతుంది. అంతేకాక అలాంటి సమయాల్లో కూడా చలా మంది ఫోర్‌ప్లే చేస్తారు. దాంతో స్ట్రెస్ తగ్గుతుందంటారు. అలా చేయడం కూడా కొంతమంది ఇష్టపడతారు. అందుకే సెక్స్మనిషి జీవితంలో ఓ భాగమని సెక్స్నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలా అని దాన్ని ఎలా పడితే అలా చేయకుండా పైన చెప్పిన విధంగా ఉంటే ఇద్దరూ ఎంజాయ్ చేయవచ్చు.
]]>