ఇంకా ఈ నేపథ్యంలోనే మొన్నటివరకు కరోనా దెబ్బకు మూగబోయిన చికెన్షాపులు ఇప్పుడు ఒక్కసారిగా తెరుచుకున్నాయి.. మొన్నటి వరుకు కేవలం అంటే కేవలం 25 రూపాయలకే కేజీ చికెన్అమ్మిన చికెన్యజమానులు ఇప్పుడు ఏకంగా వందల్లో పెంచేశారు. దీనికి కారణం ప్రజలే.. ఎందుకంటే మొన్నటి వరుకు కోడి ఫ్రీ గా ఇస్తా అన్న తీసుకొని ప్రజలు ఇప్పుడు కేజీలు కేజీలు కొని తీసుకెళ్తున్నారు.
అందుకే ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే కేజీ చికెన్ఏకంగా 200 రూపాయలకుపైగా అమ్ముతున్నారు. గ్రామాల్లో 190 రూపాయిల వద్ద నడుస్తుంటే.. పట్టణాల్లో 250 రూపాయలపైకి చేరుకుంది.. కోళ్ల వ్యాపారం నష్టం వచ్చి విలవిల్లాడిన వ్యాపారాలు ఇప్పుడు ఓ రేంజ్ లో లాభాలు పొందుతున్నారు.
ఇంకా లాక్ డౌన్ కారణంగా పండ్లు, కూరగాయలు తిని తిని అలిసిపోయిన ప్రజలు మాంసంపై పడ్డారు. అందుకే చికెన్ధరలు కూడా భారీగా పెరిగాయి. అయితే మొన్న మొన్న చికెన్డిమాండ్ తగ్గటంతో ఇంటిగ్రేషన్ కంపెనీలు కూడా కొత్త కోడిపిల్లల బ్యాచ్‌లను పెంచడం ఆపేశాయి.. కానీ ఇప్పుడు వ్యాపారులు వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకొని మరి కోళ్లకు ఆర్దార్లు ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో చికెన్ధరలు భారీగా పెరగనున్నాయి అని అర్థం అవుతుంది.
]]>