2007 టీ20ప్రపంచకప్ హీరోజోగిందర్ శర్మ 'క్రికెట్ కంటే పోలీస్డ్యూటీనే కష్టంగా ఉంది'అని పేర్కొన్నాడు .అదేనండి 2007 టీ 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్తో జరిగిన ఆఖరి ఓవర్ వేసి ఇండియాను గెలిపించిన జోగిందర్ శర్మ. 2007 టీ20ప్రపంచకప్ తరువాత క్రికెట్నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు . హర్యానాప్రభుత్వం హర్యానాలోని హిసార్ జిల్లాడీఎప్పీగా పోస్టింగ్ ఇచ్చింది . కరోనా వైరస్ప్రబలుతున్న వేల లాక్ డౌన్ లో జోగేందర్ విధులు డీఎప్పీగా నిర్వహిస్తున్నాడు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తాను 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నానని జోగి చెప్పుకొచ్చాడు. ఆటతో పోలిస్తే ఈ డ్యూటీ కొంచెం కష్టంగానే అనిపిస్తున్నప్పటికి తాను దేశం భవిష్యత్ కోసం కష్టపడుతున్నానని చెప్పుకొచ్చాడు.
తాను డ్యూటీ చేస్తున్న క్యాంపు కి తన నివాసానికి 110 కిలోమీటర్లు అయినప్పటికీ తాను కలుస్తున్న వారి కారణంగా ఫామిలీ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు . కొన్ని సందర్భాల్లో దేశంలో లాక్‌డౌన్ ఉండడంతో యూపీ, బీహార్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కాలినడకన వారి సొంతూళ్లకు చేరుకుంటున్నారు.వారికీ కరోనా కురించి జాగర్తలు చెప్పి వారికీ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆవాసాలకు చేరుస్తున్న అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి క్రికెట్తో పోల్చుకొంటే డ్యూటీ కష్టంగా ఉన్నా దేశం కోసం కష్టపడుతున్న అన్న సంతృప్తితో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు మన 2007 టీ20ప్రపంచకప్ హీరోజోగిందర్ శర్మ
]]>