ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి పోలీసులకు కంటి మీద కునుకులేకుండా పోయింది. కొంత మంది అయితే కుటుంబాలకు దూరంగా ఉంటూ, విధుల్లో తలమునకలయ్యారు. ఇదే విషయంపై తన స్వీయ అనుభవాన్ని భారత క్రికెటర్, డీఎస్పీ జోగిందర్ శర్మ పంచుకున్నాడు.
క్రికెట్ కంటే నాకు ఈ పోలీస్ డ్యూటీనే కష్టంగా ఉన్నదని జోగిందర్ శర్మ పేర్కొన్నాడు. 2007 టీ20ప్రపంచకప్ హీరోజోగిందర్ శర్మ క్రికెట్‌కు దూరమైన తర్వాత హర్యానాలోని హిసార్ జిల్లాడీఎప్పీగా విధుల నిర్వహిస్తున్నాడు. అందరి పోలీసుల్లాగే డీఎస్పీగా తాను కూడా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నానని జోగి చెప్పుకొచ్చాడు.
ఆటతో పోలిస్తే ఈ డ్యూటీ కొంచెం కష్టంగానే అనిపిస్తున్నదని, అయినప్పటికీ తాను దేశం కోసమే సేవచేస్తుండడంతో బాధ లేదని పేర్కొన్నాడు. 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నా. డ్యూటీ నేపథ్యంలో రోజుకు ఎంతోమందిని కలవడంతో ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా' అంటూ చెప్పుకొచ్చాడు.
]]>