విసుగెత్తిన ప్రేక్షకుల్లోని కొంతమంది క్రియేటివ్ పర్సన్స్ కరోనాపై సినిమారికార్డుల పోస్టర్లా డిజైన్ చేశారు. ఈ పోస్టర్లో చైనా అధ్యక్షుడిని హీరోగా చూపించారు. సినిమాటైటిల్ గా ‘కరోనా వైరస్’ ను పెట్టారు. సమ్మర్ విన్నర్అని ప్రకటించారు. 209 దేశాలకు విస్తరించిన కరోనాకు గుర్తుగా 209 సెంటర్లలో 100 రోజులు అంటూ మెన్షన్ చేశారు. వందేళ్ల తర్వాత వచ్చిన మహమ్మారిగా చెప్పుకుంటున్నాం కాబట్టి వందేళ్ల తర్వాత వచ్చిన భారీ బ్లాక్ బస్టర్అంటూ అభివర్ణించారు. పోస్టర్బ్యాక్ డ్రాప్ లో స్మశానం, టైటిల్ లో గబ్బిలాలను చూపిస్తూ కరోనాను సింబాలిక్ గా చూపించారు. డబ్ల్యూ హెచ్ ఓ సహకారంతో జిన్ పింగ్ సమర్పించు కరోనా వైరస్గా పోస్టర్వేశారు.
సరదాగా క్రియేటివ్ మైండ్ తో చేసిన ఈ పోస్టర్ఇప్పుడు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు, తమ హీరోల కొత్త సినిమాల కోసం ఫ్యాన్స్ కు ఎదురుచూపులే మిగిలాయి. ముఖ్యంగా మన దక్షిణాది భాషల్లో సినిమాకు ప్రజలకు అవినాభావ సంబంధం ఉంటుంది. దీంతో సినిమాటిక్ స్టైల్లోనే ఈ పోస్టర్ను డిజైన్ చేశారు. మొత్తానికి క్రియేటివిటీకి హద్దు లేదని నిరూపించారు మన ఆడియన్స్.
]]>