ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమావాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమావర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.
‘కరోనా’పై పోరుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) కి, డబ్బింగ్ అసోసియేషన్ కు ప్రముఖ నటుడు సాయికుమార్తన వంతు విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ‘కరోనా’ పై ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం సాయికుమార్ఓ షార్ట్ ఫిలింను నిర్మించారు. తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ఈ షార్ట్ ఫిలింను నిర్మించారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మీకోసం మేమున్నాం అనే డాక్టర్, పారిశుధ్యకార్మికుడు,పోలీస్ ఈ పాత్రలను హైలెట్ చేస్తూ షార్ట్ ఫిలిం ను రూపొందించారు. అందులో జ్యోతిర్మయిడాక్టర్గా, ఆదిపారిశుధ్య కార్మికుడుగా, సాయి కుమార్పోలీస్గా కనిపించారు. పోలిస్, పబ్లిక్ ఒకటైతే ‘కరోనా’ను తరిమివేయగలమని, ‘అంతిమ విజయం మనదే’ అంటూ సాయికుమార్చెప్పిన పవర్ పుల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ప్రజల్లో కరోనా ను ఎదుర్కొనే శక్తిని నింపుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి సాయి కుమార్ప్రయత్నం ఫలించింది..
]]>