దీంతో చాలా వరకూ రాష్ట్రాలలో ఉచిత రేషన్ తో పాటు డబ్బులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 17 రకాల సరుకులతో ఒక కిట్ రూపంలో ప్రజలకు ఇవ్వటానికి ముందడుగు వేసింది. 17 రకాల కలిగిన ఈ సరుకులు ఉచితంగానే ఇస్తున్నట్లు కేరళప్రభుత్వం చెప్పుకొచ్చింది. తాజాగా వీటికి సంబంధించి పంపిణీ కార్యక్రమం కేరళలో కొన్ని ప్రాంతాలలో స్టార్ట్ అయింది. దాదాపు కిట్టు మొత్తం వెయ్యి రూపాయల విలువైన సరుకులు ఉంటాయని కేరళప్రభుత్వం తెలిపింది.
కిట్‌లో బియ్యం, కిలో పంచదార, కిలో ఉప్పు, 250 గ్రాముల టీ పౌడర్, కారం, కంది పప్పు, అరలీటర్ వంటనూనె, రెండు కేజీల గోధుమ పిండి, కేజీ రవ్వ, మినుములు, శనగలు, సబ్బులు మొదలైన 17 రకాల వస్తువులు ఉంటాయి. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రజలందరూ షాపుల నుంచి వీటిని పొందవచ్చని కేరళపౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కాగా ఇప్పటికే ఆధార్ కార్డున్న ప్రతీ ఒక్కరికీ ఉచితంగా రేషన్, ఆహారాన్ని పంపిణీ చేస్తోంది కేరళప్రభుత్వం. కేవలం ప్రభుత్వం రిజిస్టర్ చేసిన దుకాణాల్లో మాత్రమే ఈ కిట్టు లభ్యమవుతుందని కేరళఅధికారులు స్పష్టం చేశారు.
]]>