కరోనా పై పోరుకు సినీ సెలబ్రెటీల నుండి విశేషమైన స్పందన వస్తుంది. అందులో భాగంగా ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోఅక్షయ్ కుమార్ ,పీఎం కేర్స్ ఫండ్ కు ఏకంగా 25కోట్ల విరాళం ను ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. అంతటితో ఆగకుండా తాజాగా అతను మరో మూడు కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. ఆ 3కోట్లను అక్షయ్ , పీపీఈ కిట్ల కొనుగోలుకు బాంబేమున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కి విరాళం ఇచ్చాడు.
]]>
ఈ విరాళం తో అక్షయ్ కుమార్విరాళం 28కోట్లకు చేరింది. తద్వార సినీ ఇండస్ట్రీనుండి అత్యధిక విరాళం ఇచ్చిన మొదటి సెలబ్రెటీగా అక్షయ్రికార్డు సృష్టించాడు. అక్షయ్తోపాటు ఇటీవల అమీర్ ఖాన్కూడా విరాళం ఇచ్చాడు కానీ ఎంత ఇచ్చాడో బయటికి చెప్పలేదు. ఇక టాలీవుడ్విషయానికి వస్తే రెబల్ స్టార్ప్రభాస్అత్యధికంగా 4 కోట్ల 50లక్షల విరాళం ప్రకటించాడు. అందులో కేంద్రానికి 3కోట్లు అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు 50లక్షల చొప్పున విరాళం ప్రకటించగా కరోనా క్రైసిస్ చారీటీ (సిసిసి) కి 50లక్షల విరాళం ప్రకటించాడు.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతుండడం తో సినీ కార్మికులకు అండగా ఉండడానికి మెగాస్టార్చిరంజీవిఆధ్వర్యంలో ఈసంస్థ ను స్థాపించారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సీసీసీకి విరాళాలను ప్రకటించారు. ఈరోజు స్టార్ కమెడియన్బ్రహ్మనందం 3 లక్షలు ప్రకటించగా రాజమౌళి, దానయ్య డివివి 10లక్షల విరాళాలను ప్రకటించారు. దాంతో సీసీసీ కి వచ్చిన విరాళాల మొత్తం 13కోట్లకు చేరింది. ఇక కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గకపోవడంతో మరి కొన్ని రోజులు షూటింగ్ లు నిలిచిపోనున్నాయి.