Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305803

మొదలైన రచ్చ: ఇది సమయం కాదా..వాళ్లేమో రంగంలోకి దిగేశారు...

$
0
0
ఏపీలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే మరోవైపు వైసీపీప్రభుత్వం ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్విషయంలో  సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన నియామక అర్హతనిబంధనాలపై ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి, దాన్ని గవర్నర్చేత ఆమోదముద్ర వేయించుకుని, ఈసీరమేష్ కుమార్పదవీకాలం మూడేళ్లకు కుదించింది.

దీంతో ఐదేళ్లు కొనసాగాల్సిన రమేష్ పదవీకాలం మూడేళ్లకు పడిపోయింది. ఇక ఇప్పటికే ఆయన పదవికిలోకి వచ్చి మూడేళ్లు కావడంతో ,ఆయనని పదవి నుంచి తొలగించేశారు. అయితే రమేష్ పై వైసీపీప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కారణం లేకపోలేదు. మార్చిలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన స్థానికసంస్థల ఎన్నికలని, కరోనా ప్రభావంతో రమేష్ కుమార్తనకున్న విచక్షణ అధికారాల్ని ఉపయోగించి ఆరు వారాలు పాటు వాయిదా వేశారు.



ఇక ఈ నిర్ణయం జగన్ప్రభుత్వానికి నచ్చలేదు. అప్పుడు కరోనా ప్రభావం లేకపోయినా, తమని సంప్రదించకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారంటూ జగన్తో సహా వైసీపీనేతలు రమేష్ కుమార్పై మండిపడ్డారు. రమేష్, చంద్రబాబు  సామాజికవర్గానికి చెందిన వారు కాబట్టి, టీడీపీలైన్ లో ఉండి ఎన్నికలు వాయిదా వేశారని వైసీపీనేతలు విమర్శలు చేశారు. అయితే కరోనా వ్యాప్తి పెరగడంతో, ఆ వ్యవహారం పక్కకు వెళ్ళిపోయింది. కానీ కరోనాతో ఓ వైపు పోరాటం చేస్తున్న సమయంలోనే వైసీపీప్రభుత్వం సైలెంట్ గా రమేష్ కుమార్ని పక్కకు తప్పించేసింది.



ఇక దీనిపై చంద్రబాబు, పవన్కళ్యాణ్, కన్నాలక్ష్మీనారాయణ, సీపీఐరామకృష్ణలాంటి ప్రతిపక్ష నాయకులంతా రంగంలోకి దిగేసి, రమేష్ ని ఎలా తప్పిస్తారంటూ వైసీపీప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.పైగా కరోనా విజృంభిస్తున్న సమయంలో వైసీపీప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దారుణమని అన్నారు. రమేష్‌ కుమార్‌ను మార్చేందుకు దొడ్డిదారిన సవరణలు చేశారని చంద్రబాబు విమర్శించారు. అటు పవన్నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్న సామెతలా సాగుతోంది ప్రభుత్వ వ్యవహారం అంటూ ఎద్దేవా చేశారు. మరి ప్రతిపక్షాలు రమేష్ కుమార్వ్యవహారంలో ఇంత ఘాటుగా స్పందిస్తున్న , నేపథ్యంలో వైసీపీనేతలు కూడా కౌంటర్ ఇచ్చే పనిచేస్తున్నారు.



గవర్నర్రాజ్యాంగ బద్ధంగానే సవరణ తీసుకొచ్చారని దీనిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటున్నారు. మరి చూడాలి ఈ ఎలక్షన్ కమిషనర్ వ్యవహారంపై రచ్చఇంకెంత ముదురుతోందో

]]>

Viewing all articles
Browse latest Browse all 305803

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>