Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305803

ఆరోగ్యం: మ‌ందారం టీ ఉప‌యోగాలు తెలిస్తే.. రోజూ తాగేస్తారు..!!

$
0
0
మందారం పూలు గురించి తెలియ‌ని వారుండ‌రు. ముఖ్యంగా మందార ఆకులు, పూవులు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తాయని  అంద‌రికి తెలసిందే. ఈ మందార పువ్వు పొడిని తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. మ‌రియు తరచు మందార పువ్వుతో ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. అయితే మందారం అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆరోగ్యానికి మందారం టీ అద్భుతంగా ప‌నిచేస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే మందారం టీ శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా, రక్తనాళాలను మరియు గుండెసంబంధిత భాగాలు ప్రమాదానికి గురవకుండా ఉంటాయి. అలాగే మందార టీలో విటమిన్ సి, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. అందుకే రోజూ ఒక క‌ప్పు మందారం టీ తాగ‌డం వ‌ల్ల‌.. శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మందార పువ్వుల టీ తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇది లివర్‌లో ఉన్న కొవ్వు కరిగిస్తుంది.



అదేవిధంగా, మందార టీ దాహాన్ని తీర్చుట వల్ల‌ క్రీడా పానీయాలలో ఉపయోగిస్తారు. సాదారణంగా ఈ ప్రయోజనం కోసం మందార టీని ఒక శీతల రూపంలో వినియోగిస్తారు. ఈ రకమైన టీ చాలా వేగంగా శరీరాన్ని చల్లబరిచే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల చాలా మంది వారి ఆహారంలో చేర్చుకుంటారు. మ‌రియు మందార టీ బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది జీర్ణక్రియ మెరుగుపరచడానికి మందార టీని సేవిస్తారు.


]]>

Viewing all articles
Browse latest Browse all 305803

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>