సాధారణంగా ఎక్కువగా రోజూ 1.5 జీబీ లేదా 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం అలవాటు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ 4జీ డేటా ఏమాత్రం సరిపోవట్లేదు. అయితే ఇలాంటి వారికి జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ఐడియాకంపెనీలు రోజూ 3 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. మరి వాటి ధరలు ఎంత..? అందులో మీకు ఏది బెస్ట్..? అన్నది ఇప్పడు తెలుసుకోండి.
ఎయిర్‌టెల్: ఎయిర్‌టెల్‌లో రూ.398 రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఈ ప్యాక్ ద్వారా మొత్తం 84 జీబీ డేటా మీరు పొందొచ్చు.
జియో: జియోలో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3 జీబీ డేటా పొందొచ్చు. వేలిడిటీ 28 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. ఈ ప్యాక్ ద్వారా మొత్తం 84 జీబీ డేటా మీరు పొందొచ్చు. ఇందులో మరో విషయం ఏంటంటే.. రోజూ 3జీబీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ స్పీడ్‌లో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు.
వొడాఫోన్ఐడియా: వొడాఫోన్ఐడియాలో రూ.398 రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. ఈ ప్యాక్ ద్వారా మొత్తం 84 జీబీ డేటా మీరు పొందొచ్చు.
]]>