Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305753

నితిన్ సినిమా మీద ఆశలు పెట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ...!

$
0
0
మన చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా దూసుకు వచ్చింది రకుల్ప్రీత్ సింగ్. వరుసగా భారీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు దక్కించుకుంది. సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది. స్టార్ హీరోల సినిమాఅవకాశాలు కోట్లకి పెరిగిన రెమ్యూనరేషన్. చెప్పాలంటే నాలుగేళ్ళు ఒక వెలుగు వెలిగింది. అయితే ఇక్కడ హీరోయిన్ప్లేస్ శాశ్వతం కాదు. ఒక్క ఫ్లాప్ పడితే చాలు తీసి పక్కన పెట్టేస్తారు. అప్పటి వరకు లక్కీ హీరోయిన్అని వెంటపడిన నిర్మాతలు హీరోలు మొహం చాటేస్తారు. అదే రకుల్ప్రిత్ విషయంలో జరిగింది. ఊపిరాడకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్లో సినిమాలు చేసిన రకుల్ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది.

కోలుకోలేకుండా ఫ్లాపుల మీద ఫ్లాపులు పడి దెబ్బ మీద దెబ్బ పడి చేతిలో ఒక్క అవకాశం లేకుండా పోతుంది. ఫ్లాప్స్ రావడంతో మళ్ళీ ఒక భారీ సక్సస్ అందుకోవాలని ప్రయత్నించినా అన్నీ చిత్ర పరిశ్రమల నుంచి ఆఫర్స్ రావడం ఆగిపోయాయి. దాంతో సతమవుతున్న రకుల్హీరోయిన్గా ఒక్క అవకాశం వచ్చినా చాలని కళ్ళూ కాయలు కాచేలా ఎదురుచూసింది. అలా ఎదురు చూసే తప్పు చేశానంటోంది రకుల్ప్రీత్ సింగ్. గత రెండు సంవత్సరాలుగా చేతిలో సినిమాలేక కెరీర్ తిరగబడింది. దానికి తోడు పూజాహెగ్డే - రష్మికలాంటి మోస్ట్ వాంటెడ్హీరోయిన్స్ని తట్టుకొని రకుల్పోటీ ఇవ్వలేక మొత్తానికే ఫేడవుట్ అయిపోయింది.



అయితే రకుల్కెరీర్ ఇలా అవడానికి కారణం తను తొందరపడి చేసిన పొరపాటే అని ఇప్పుడు రియలైజ్ అయింది. అవకాశాలు లేక ఇబ్బందుల్లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్అక్కినేనినాగార్జునతో కలిసి నటించిన 'మన్మథుడు 2' కమిటవడమే తను చేసిన పెద్ద పొరపాటు అని చాలా ఆలస్యంగా అర్థం చేసుకుందట. అయితే ఈ సినిమాపై రకుల్చాలా ఆశలు పెట్టుకుంది. మళ్ళీ కెరీర్ ఫాం లోకి వస్తుందని ఊహించుకొనే ఈ సినిమాకి సైన్ చేసింది. అందుకే లిప్ లాక్స్ ఉన్నా, దమ్ముకొట్టే సీన్స్, బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఒకే చెప్పింది. అదే రకుల్చేసిన తప్పని ఇప్పుడు కుమిలిపోతుందట. అయితే ప్రస్తుతం నితిన్సరసన ఒక సినిమాలో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. ఈ సినిమామీద ఎంతో నమ్మకం పెట్టుకుంది. మరి ఈ సినిమారకుల్కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 

]]>

Viewing all articles
Browse latest Browse all 305753

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>