వీటితో ప్రజల్లో ఎక్కడాలేని భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో తెలంగాణప్రభుత్వం ఈ రెడ్జోన్లు, బఫర్, హాట్ స్పాట్ జోన్లను ఎత్తివేసింది. వీటికి బదులుగా మరో కొత్త పేరును చేర్చింది. తాజాగా హైదరాబాద్లోని 12 ప్రాంతాలను కంటైన్ మెంట్ జోన్లుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీటికి కొత్త పేరుగా 'కంటైన్ మెంట్లు' అని పేరు పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా వ్యాధి తీవ్రత 12 ప్రాంతాల్లో ఎక్కువుగా ఉంది. మర్కజ్ వెళ్లిన 603మంది లో వంద మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.
హైదరాబాద్‌లో మర్కజ్ ప్రాంతానికి వెళ్లిన వారు అధికంగా ఉండడంతో అసలు ఇంకెంత మందికి ఈ వైరస్ సోకిందో అన్న ఆందోళనలు ఎక్కువుగా ఉన్నాయి. వీరిని మరింత టెన్షన్ పెట్టేలా ఉన్న ఈ పేర్లు మార్చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు కొత్తగా కంటైన్‌మెంట్లు అని పేరు మార్చింది. ఇక హైదరాబాద్ లోని 30 కాలనీల్లో వేలాది కుటుంబాలను అధికారులు దిగ్బంధించి ఇంటింట సర్వేచేస్తున్నారు. వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపుతున్నారు. కాలనీల నుంచి లోపలికి బయటకు ఎవరూ రాకుండా చర్యలు చేపడుతున్నారు.
]]>