Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298109

తాంబూలాలిచ్చారు, ఇక తన్నకు చావండి అన్నట్లుంది వాళ్ళ ధోరణి....!!

$
0
0
టాలీవుడ్దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితెరకెక్కించిన బాహుబలిరెండు భాగాలూ కూడా ఎంతటి గొప్ప విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. కేవలం మన దేశంలోనే కాక పలు ఇతర దేశాల్లో సైతం బాహుబలితన కలెక్షన్ల ప్రభంజనాన్ని వారికి రుచి చూపించింది. ఇక ఆ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పేరు, ప్రఖ్యాతలు ఆర్జించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, ప్రస్తుతం యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్రామ్ చరణ్లతో కలిసి రౌద్రం రణం రుధిరం సినిమాతీస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్న ఈ సినిమారాబోయే 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక రెండేళ్ల క్రితం ప్రశాంత్ నీల్దర్శకత్వంలో కన్నడరాక్ స్టార్ యాష్ హీరోగా తెరకెక్కిన కెజిఎఫ్చాప్టర్ 1 సినిమా, పలు భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 2తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాదసరాపండుగకానుకగా అక్టోబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాబాహుబలి, బాహుబలి 2 రికార్డ్స్ ని కొల్లగొడుతుంది అంటూ కొద్దిరోజులుగా పలువురు సినిమాప్రేక్షకులు సోషల్ మీడియామాధ్యమాల్లో విపరీతంగా చర్చలు మొదలెట్టి, కొద్దిపాటి వివాదాలను సృష్టిస్తున్నారు. వారిలో కొందరేమో బాహుబలిరికార్డ్స్ ని కొట్టగల సత్తా మళ్ళి రాజమౌళితీస్తున్న ఆర్ఆర్ఆర్కే సాధ్యం అని అంటుంటే, ఇంకొందరు మాత్రం ఆ అవకాశం కెజిఎఫ్ చాప్టర్ 2కే ఉందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 



అది మాత్రమే కాక ఇంకొందరు అయితే వీటిలో ఏ సినిమాబాహుబలిరికార్డ్స్ ని కొల్లగొడుతుంది అంటూ పోల్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక వాస్తవం చెప్పాలంటే ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్రెండూ కూడా దేనికవే భిన్న ధ్రువాలైన సినిమాలని, అలానే రెండు సినిమాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న మాట వాస్తవం అని, కాగా నిజంగా వాటిలో ఏది బాహుబలిరికార్డ్స్ ని కొల్లగొడుతుంది అనేది ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యం కాదు, రేపు అవి రిలీజ్ అయినా తరువాతనే చెప్పగలం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఇచ్చేయడయంతో తాంబూలాలు ఇచ్చాము ఇక తన్నుకు చావండి అనే చందాన ఉంది ఈ సినిమాల గురించి ప్రస్తుతం జరుగుతున్న వాదన అని, కాబట్టి ఇప్పుడే వీటి గురించి వాదించుకోవడం సరైనది కాదని వారు అంటున్నారు.....!! 


]]>

Viewing all articles
Browse latest Browse all 298109

Trending Articles