* కరోనా మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితి మనకు ఎంతో గుణపాఠం నేర్పింది. అనేక విషయాలపై అవగాహన కల్పించింది. ప్రధానంగా మనందరిలో వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యం, ఆరోగ్యం వంటి కీలక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా చేసింది. కష్టకాలంలో అంటే వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్న వారందరి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించేలా చేసింది. విద్యార్థులు పరీక్షల గురించి బాధపడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. కానీ.. ఇప్పుడు మనముందు అంతకన్నా పెద్ద పరీక్ష ఉంది. కరోనా సంక్షోభం నుంచి బయటపడడమే పెద్దపరీక్ష. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవరం లేదు. డిజిటల్ క్లాస్‌లపై దృష్టి సారించాలి. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది* అని
తెలంగాణమంత్రికేటీఆర్కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సోషల్
మీడియావేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇలా సమాధానం చెప్పారు. అంతేగాకుండా. లాక్‌డౌన్‌పై
మంత్రికేటీఆర్మరిన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
లాక్‌డౌన్‌తో ప్రజల్లోనూ స్వీయనియంత్రణ ఏర్పడిందని, దానిని భవిష్యత్‌లోనూ కొనసాగించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ కట్టడికి కృషి చేస్తున్న వైద్యులు, నర్సలు, పోలీసులపై ప్రజల్లో గౌరవం ఏర్పడిందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ కట్టడికి ప్రపంచంలోనే అనేక దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయని, దీని వల్ల వాతావరణ కాలుష్యం, భూతాపంలో భారీగా మంచి మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణమంత్రికేటీఆర్అన్నారు. అందుకే ప్రతి ఏడాది పది రోజులపాటు పరిమిత స్థాయిలో లాక్‌డౌన్ పాటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా కట్టడికి మరికొంత కాలం లాక్‌డౌన్ కొనసాగించాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అయితే.. ప్రతీఏడాది లాక్‌డౌన్ విధించాలన్న కేటీఆర్అభిప్రాయానికి ముందుముందు మరింత మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన సూచన సరికొత్త ప్రపంచానికి శ్రీకారం చుడుతుందని అంటున్నారు.
]]>