వాస్తవానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. పిల్లలు పుట్టాక చాలా మంది అమ్మాయిలు బరువు పెరిగిపోతుంటారు. ఇది సహజమే. అయితే కొందరు మాత్రం పిల్లలు పుట్టక ముందే లావు అవుతారు. ఆరోగ్య ప్రభావమో లేదా చిన్నప్పటి నుండి బాగా తినటం వల్లనో కొంత మంది వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది లావుగా ఉంటారు. అయితే ఆ లావు బ్యాడ్ కొలిస్ట్రాల్ వల్ల వస్తే మాత్రం చాలా నష్టం అంటున్నారు నిపుణులు.
పిల్లలు పుట్టకముందే బ్యాడ్ కొలిస్ట్రాల్ కారణంగా లావుగా మారే అమ్మాయిల్లో తల్లి అయ్యే సామర్థ్యం చాలా తక్కువ ఉంటుందట. మహాఅయితే.. ఒకరికి జన్మ ఇవ్వగలరట. అంతే ఇక రెండో సారి ప్రెగ్నెన్సీ రావడం మాత్రం చాలా కష్టం అంటున్నారు నిపుణులు. ఇక కొందరికైతే అసలు గర్భం పొందడమే చాలా కష్టం అంటున్నారు. కాబట్టి పిల్లలు కావాలనుకునే అమ్మాయిలు మందుగానే బరువును అదుపులో ఉంచుకోవడం మంచిందటున్నారు.
]]>