Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298115

కొత్త హీరోయిన్లకు అవకాశాలు...!

$
0
0
టాలీవుడ్లో ఇప్పుడు నిర్మాతల ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం... ప్రస్తుతం ఉన్న నష్టాల నుంచి పూర్తిగా బయటకు రావడం. సినిమావిడుదల అయినా సరే నష్టాలు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు నిర్మాతలు నష్టాల నుంచి బయటకు రావడానికి ఖర్చు లు తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరితో పడితే వాళ్ళతో సినిమాచేయకుండా ఉండాలని భావిస్తున్నారు. అగ్ర హీరోఅయినా సరే హిట్ ట్రాక్ చూసిన తర్వాతే సినిమాను ఓకే చెయ్యాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాహిట్ అవ్వాలి అంటే ఇప్పుడు కథ సరిగా ఉండటమే కాదు... 

ఖర్చు బాగా తగ్గితే సినిమాహిట్ చేసుకుని... అప్పుడు నష్టాల నుంచి బయటకు రావాలి అని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో చాలా మంది హీరోల సినిమాలు లైన్ లో ఉన్నాయి. చిన్న చిన్న సినిమాలను కూడా వాయిదా వేసారు. ఇక ఇది పక్కన పెడితే హీరోయిన్ల వెంట పడకుండా కొత్త హీరోయిన్స్కి అవకాశాలు ఇవ్వాలని ఇప్పుడు దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. కొత్త హీరోయిన్అయితే డిమాండ్ చేసే అవకాశం ఉండదు అని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియామీద దృష్టి పెట్టారు. 



సోషల్ మీడియాలో ఎవరు అయితే ఎక్కువగా హడావుడి చేస్తూ అందాలు ఆరబోస్తూ నటనకు రెడీ గా ఉన్నారో వాళ్లకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. కరోనా తర్వాత ఎవరికి కూడా భారీగా ఇచ్చుకునే పరిస్థితిలో నిర్మాతలు లేరు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచించి సినిమాలు చెయ్యాలని చూస్తున్నారు. టాలీవుడ్హీరోలు కూడా ఇప్పుడు పారితోషికం తగ్గించుకుని భవిష్యత్తులో ఎక్కువగా తీసుకోవాలని భావిస్తున్నారట. నిర్మాతల కష్టాలను అర్ధం చేసుకుని డిమాండ్ లు ఎక్కువగా చేయడం లేదని టాలీవుడ్లో ఇప్పుడు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.

]]>

Viewing all articles
Browse latest Browse all 298115

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>