నిజానికి.. మార్చి 25వ తేదీన అన్నరకాల డ్రగ్స్ ఎగుమతిని కేంద్రప్రభుత్వం నిషేధించింది. ఈ క్రమంలోనే తమ దేశానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులను పంపించాలంటూ అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్స్వయంగా ప్రధాని మోడీకి ఫోన్చేయడం.. భారత్ నుంచి స్పందన లేకపోవడంతో ఒకదశలో ట్రంప్బెదిరింపులకు పాల్పడడం ఆ తర్వాత కొంతమేరకు సడలింపులు ఇవ్వడం తెలిసిందే. ఇక అప్పటి నుంచి మిగతా దేశాలు కూడా ఈ మందు కోసం భారత్ ముందు క్యూ కడుతున్నాయి. ఇప్పటివరకు సమారు 30కిపైగా దేశాలు ఈ మందు కోసం భారత్‌ను వేడుకున్నాయి. అయితే.. ఇందులో మొదటి జాబితాలో కొన్ని దేశాలకు భారత్ ఈ మందును పంపింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం 13 దేశాల మొదటి జాబితాను భారత్క్లియర్ చేసింది. ఇందులో యూఎస్ఏ, స్పెయిన్, జర్మనీ, బహ్రెయిన్, బ్రెజిల్, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, సీషెల్స్, మారిషస్& డొమినికన్ రిపబ్లిక్ఉన్నాయి. మొత్తం 14 మిలియన్ టాబ్లెట్లను భారత్ పంపింది.
]]>