Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

చెన్నైలో దారుణం: దొంగ‌త‌నానికి వ‌చ్చి మ‌హిళ‌పై లైంగిక‌దాడి

$
0
0
 లాక్‌డౌన్ నేప‌థ్యంలో పోలీసులు క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. అక్క‌డ‌క్క‌డ నేరాలు, ఘోరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. చైన్నైలో జ‌రిగిన ఓ దారుణం ఆల‌స్యంగా వెలుగుచూసింది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా ప‌లు జైళ్ల నుంచి ఖైదీల‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అలా విడుద‌ల అయిన ఓ ఖైదీదొంగ‌త‌నానికి వ‌చ్చి డాబాపై ఒంట‌రిగా నిద్రిస్తున్న‌ మ‌హిళ‌పై లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. ఇంత‌కీ ఏం జ‌రిగిందో చూద్దాం.. అమింజికరైకు చెందిన  రామకృష్ణన్ అనే యువ‌కుడు చోరీ కేసులో ఇటీవ‌ల‌ అరెస్టు అయ్యాడు. లాక్‌డౌన్‌ పుణ్యమా అని బయటకు వచ్చాడు. జైలు నుంచి రాగానే త‌న బుద్ధి మాత్రం మార్చుకోలేదు. అన్నాగనర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి గురువారం సాయంత్రం వెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేశారు. స్థానికులు గుర్తించి కేకలు పెట్టడంతో అక్క‌డి నుంచి పారిపోయాడు. 

అయితే.. అక్క‌డితోనే ఆ యువ‌కుడు ఆగ‌లేదు. ఆ త‌ర్వాత తిరుమంగళం వైపు వెళ్లాడు. ఓ నాలుగు అంతస్తుల భవనంలోకి ప్రవేశించాడు. అక్కడ పై అంతస్తు డాబాపై ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై లైంగిక దాడికి పాల్పడి పారిపోయాడు. ఆమె పెట్టిన కేకలతో చుట్టుపక్కల వారు అక్క‌డికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అన్నాగనర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. అన్నానగర్, తిరుమంగళం పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల మేరకు ఆ యువకుడిని గుర్తించి, ప‌ట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. పోలీసులు ఇంత క‌ట్టుదిట్టంగా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఇలాంటి దారుణాలు ఆగ‌డం లేద‌ని తీవ్ర ఆవేద‌న‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు. 



]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>