అలాంటి రెడ్జోన్ జిల్లాలో షేక్ జాఫర్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలసి సరదాగా బయటికి వచ్చాడు.. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో గ్రామంలో రోడ్లపై తిరుగుతున్నారన్న సమాచారంతో అదే సమయంలో పోలీసులు రాయపూడి చేరుకున్నారు. పోలీసులను చుసిన గ్రామస్థులు ఒక్కసారిగా పొలాలవైపు పరుగులు తీశారు.
ఇంకా గ్రామస్థులను బయట ఎందుకు తిరుగుతున్నారంటూ కానిస్టేబుల్ రామయ్య వెంటపడటంతో భయంతో పరిగెడుతూ జాఫర్ కిందపడిపోయి అక్కడికక్కడే మరణించాడు. అయితే జాఫర్ కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు.
ఇకపోతే జాఫర్ మరణానికి కానిస్టేబుల్ అత్యుత్సాహమే కారణం అని.. జాఫర్ పరిగెత్తలేక కిందపడి మరణించాడు అని అతని స్నేహితులు చెప్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తుళ్లూరు సిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు... ఏది ఏమైనా లాక్ డౌన్ సమయంలో బయటకు రావడం జాఫర్ తప్పు.. బయటకు వచ్చారే అనుకుందాం.. పోలీసులు కనిపిస్తే కారణం చెప్పాలి కానీ ఏదో తప్పు చేసినట్టు పరుగులు ఇలా అవ్వక ఇంకా ఎలా అవుతుంది? అందుకే లాక్ డౌన్ సమయంలో ఇంటిలోనే ఉండండి.. మీరు ఆరోగ్యంగా ఉండండి.. పోలీసులను ప్రశాంతంగా ఉంచండి.
]]>