Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

మహేష్ మేకోవర్ పై పెరిగిపోతున్న ఒత్తిడి !

$
0
0
సినిమాల్లో నటించడమే కాకుండా పలు కార్పోరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాడు. సినిమానిర్మాణం మల్టీప్లెక్సులు గార్మెంట్స్బిజినెస్లో కూడా మహేష్హవా కొనసాగుతోంది. మహేష్సొంతంగా జీఎంబీ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న పరిస్థితులలో ఈ బ్యానర్ కు రిలయన్స్బ్యాకెండ్ నుంచి ఫండింగ్ ఇస్తున్నారని టాక్. 


దీనికితోడు మహేష్జియోరిలయన్స్టీమ్ తో కలసి భాగస్వామ్యంతో ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేద్దామని  ప్రయత్నాలు కూడ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్సపోర్ట్ ఉంటుంది కాబట్టి మహేష్తన సినిమాలను పాన్ ఇండియాస్థాయిలో విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. 



ఇది అంతా నాణానికి ఒకవైపు మహేష్టాప్ హీరోగా తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకుంటూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ అడుగులు వేస్తున్నామహేష్ఒక విషయంలో మటుకు మిగతా టాప్ హీరోలతో వెనకపడి ఉన్నాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు టాప్ హీరోలు సినిమాసినిమాకు తమ గెటప్ ను మార్చుకుంటూ డిఫరెంట్ మేకోవర్ లో కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు స్టైలిస్ట్ స్టార్ గా పేరు గాంచిన అల్లు అర్జున్ఈమధ్యనే తన లేటెస్ట్ మూవీ‘పుష్ప’ కు సంబంధించి చూపెట్టిన డిఫరెంట్ లుక్ అందర్నీ ఆకర్షిస్తోంది. 



రామ్ చరణ్‘రంగస్థలం’ మూవీలో గుబురు గెడ్డంతో లుంగీతో కనిపించి తాను కూడ సినిమాసినిమాకు తన లుక్ మార్చుకోగలనని అందరికీ తెలియచేసాడు. ఇక జూనియర్ఎన్టీఆర్అయితే ‘జై లవ కుశ’ మూడు పాత్రలకు మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి తన రేంజ్ ని చాటుకున్నాడు. ఇక ప్రభాస్రానాలు అయితే సినిమాలో తన పాత్రకు సంబంధించిన లుక్ కోసం ఎంతటి సాహసం చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. వాస్తవానికి మహేష్ను ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో డిఫరెంట్ గా చూపించాలని అనీల్ రావిపూడిఎన్నో ప్రయత్నాలు చేసినా మహేష్లుక్ లో పెద్దగా మార్పులు కనిపించ లేదు అన్న కామెంట్స్ వచ్చాయి. దీనితో త్వరలో పరుశు రామ్దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న మూవీలో అయినా మహేష్తన లుక్ మార్చుకుని కొత్త మేకోవర్ తో కనిపించకపోతే ఈ టాప్ హీరోల రేస్ లో సూపర్ స్టార్అయినప్పటికీ మహేష్రానున్న రోజులలో క్రేజ్ కోల్పోయే ఆస్కారం ఉంది అంటూ కొందరు విమర్శకులు మహేష్కు హెచ్చరికలు ఇస్తున్నారు..


]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>