రాజకీయ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాటైటిల్ ని దాదాపుగా ఖరారు చేసారు. అయిననూ పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని ఈ సినిమాకు ఖరారు చేసింది చిత్ర యూనిట్. దాదాపుగా దీన్నే ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్కూడా దీనికి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో గాని ఈ టైటిల్ విషయంలో కళ్యాణ్ రామ్ఆలోచిస్తున్నాడు అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అరవింద సమేతసినిమాసమయంలోనే ఓకే చేసినా అప్పుడు కొన్ని కారణాలతో వాయిదా వేసారు.
ఇక ఈ సినిమాతర్వాత జూనియర్ఎన్టీఆర్తో సినిమాచేయడానికి బాలీవుడ్జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. బాబు ని తన సినిమాలో కావాలి అని రణవీర్ సింగ్అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. అతను చేసే ఒక లవ్ స్టోరీలో ఎన్టీఆర్ని యాక్షన్ హీరోగా తీసుకోవాలని నిర్మాతలకు ప్రతిపాదన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆ సినిమాలో ఎన్టీఆర్కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బాలీవుడ్లో ఇప్పుడు టాక్. ఈ సినిమావచ్చే ఏడాది మొదలవుతుంది.
]]>