ఇకపోతే ఓమహిళచేసిన తొదరపాటుపనికి గర్భం రాగా, దొంగచాటుగా అబార్షన్ చేపించుకుని, ఆ మృత శిశువును చెట్లపొదల్లో పడవేసి వెళ్లిపోగా, ఆ విషయంలో కూపీ లాగుతున్న పోలీసులకు ఒక ఆర్‌ఎంపీ నడుపుతున్న చీకటి భాగోతం వెలుగులోకి వచ్చింది.. ఆ ఆర్‌ఎంపీ పేరు ఖాజాపాషా .. భద్రాద్రికొత్తగూడెం జిల్లాదుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం గ్రామానికి చెందిన ఇతను చేస్తున్న దందాలను తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆర్‌ఎంపీ ఇంటితో పాటుగా, చుట్టుపక్కల మరికొంతమంది ఇళ్లల్లో సోదాలు చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన రూ.లక్షల విలువైన వివిధ రకాల ఔషధాలు, ఇంజెక్షన్లు, అబార్షన్‌లకు సంబంధించిన ఇతర పరికరాలు పోలీసుల కంటపడ్డాయి. ఇతను లాక్‌డౌన్ నేపథ్యంలో అక్రమంగా మద్యాన్ని కూడా విక్రయిస్తున్నాడని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇతని వద్ద నుండి సుమారు రూ.50 వేల విలువైన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే కాకుండా ఈ ఆర్‌ఎంపీ ఖాజాపాషా దగ్గరికి గురువారం రాత్రి అయిదు నెలల గర్భిణి, ఇద్దరు వ్యక్తులు వచ్చి అబార్షన్ చేయాలని కోరారు. అందుకు అధిక మొత్తంలో డబ్బును డిమాండ్ చేయగా వారు అతను అడిగినంత పైకాన్ని ముట్ట చెప్పడంతో ఆ మహిళకు అబార్షన్ చేసాడు.. పుట్టిన ఆ మృత శిశువును ముళ్లపొదల్లో పడేసి ఆ బాలింత, ఆమెతో పాటుగా వచ్చిన ఇద్దరు గుట్టుచప్పుడు కాకుండా వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం స్థానికులు మృత శిశువును గుర్తించి సమాచారమివ్వడంతో సీఐ వెంకటేశ్వర్లు విచారించారణ చేపట్టగా ఈ భాగోతం బయటకు వచ్చింది.. దీంతో ఆర్‌ఎంపీ డాక్టర్పరారయ్యాడు.. ఇతనితో పాటుగా ఆ బాలింత, మరో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు...
]]>