Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 298116

త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాని పక్కన పెట్టలేదా...? మహేష్ - త్రివిక్రమ్ కాంబో రూమర్ మాత్రమేనా...?

$
0
0
ప్రస్తుతం లాక్‌ డౌన్‌ నేపథ్యంలో సెలబ్రిటీలంతా ఇళ్లలోనే ఉంటూ కొత్త ప్రాజెక్టులపై కసరత్తు ప్రారంభించారు. షూటింగ్‌లో ఉన్న సినిమాలు నిలిచిపోవడంతో భవిష్యత్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ హీరో, ఏ డైరెక్టర్‌తో ఏ సినిమాచేయనున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాచేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూపర్‌స్టార్ మహేష్బాబు, స్టార్ డైరెక్టర్త్రివిక్రమ్కాంబినేషన్‌లో 'అతడు', 'ఖలేజా`' సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలు ఇప్పటికీ టీవీల్లో విపరీతమైన ఆదరణను సంపాదించుకుంటున్నాయి. పదేళ్ల క్రింద వచ్చిన 'ఖలేజా' తర్వాత వీరిద్దరూ ఇప్పటివరకు కలిసి పనిచేయలేదు. ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయని, అందుకే కలిసి పనిచేయడం లేదని గతంలో వార్తలు వచ్చాయి. ఇటీవల మహేష్‌ నటించిన ‘సరిలేరు నీకెవ్వరరు’, త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అల వైకుంఠపురములో’ రెండూ బిగ్గెస్ట్‌ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ఎన్టీఆర్సినిమాను పక్కన పెట్టి మహేష్తో సినిమాచేయడానికి రెడీ అవుతున్నదని ఫిల్మ్ నగర్లో న్యూస్ చక్కర్లు కొట్టింది. 

అయితే ఇప్పుడు తాజాగా మహేష్‌ బాబు - త్రివిక్రమ్‌ సినిమాగురించి వచ్చిన రూమర్ ఇవి బేస్ లెస్ రూమర్ అని తెలుస్తోంది. త్రివిక్రమ్తన తదుపరి సినిమాఎన్టీఆర్తోనే ఉంటుందని.. దీనికి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారని సమాచారం. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ఫోకస్ మొత్తం ఎన్టీఆర్నెక్స్ట్ సినిమాపైనే ఉందని, ఈ సినిమాలో తారక్ని స్టైలిష్ లుక్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్కెరీర్లో 30వ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్ రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో తన షూటింగ్ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్తో జాయిన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమాషూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 

]]>

Viewing all articles
Browse latest Browse all 298116

Trending Articles