దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగిస్తారా.. లేదా అన్న సస్పెన్స్‌కు నేటితో తెరపడనుంది. లాక్డౌన్ గడువు మంగళవారంతో ముగియనున్న నే పథ్యంలో ప్రధానిమోదీశనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే లాక్డౌన్ పొడిగింపు అంశంపై చర్చించి, కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనంతరం ప్రధాని మోడీజాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం.
]]>
ఒకవేళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తే నిబంధనల్లో పలు మార్పులు చేయొచ్చని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటున్నందున కొన్ని రంగాలను లా క్‌డౌన్ నుంచి మినహాయిస్తారని అంటున్నారు. అయితే వాటిపై పలు ఆంక్షలను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలపై ప్రధానమంత్రికార్యాలయంలో అధికారులు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మరోపక్క అన్ని లాక్డౌన్ ను పొడిగించాలని ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.
]]>