అసలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇటువంటి ప్రచారం ఏమిటంటూ పెద్ద లా పాయింటే లేవదీశారు. సరే అధికార పార్టీపై చంద్రబాబు, బిజెపి, సిపిఐ, జనసేననేతలు చేస్తున్న ఆరోపణలపై వైసిపినేతలు తిప్పి కొడుతున్నారనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వైసిపినేతలు, అభ్యర్ధులపై చంద్రబాబు ఎటువంటి ఆరోపణలైతే చేస్తున్నారో అవే పనులను టిడిపినేతలు కూడా చేస్తున్నారు.
విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, సత్యవేడు, హిందుపురం లాంటి అనేక చోట్ల టిడిపిఅభ్యర్ధులు, నేతలు ఎన్నికల ప్రచారాన్నే చేసుకుంటున్నారు. నిత్యావసరాల పంపిణి పేరుతో చంద్రబాబు, బాలకృష్ణలతో పాటు కొన్ని చోట్ల అభ్యర్ధుల ఫొటోలున్న ప్యాకెట్లను పంపిణి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి టిడిపినేతలు, అభ్యర్ధులు చేసుకుంటున్న ప్రచారం చంద్రబాబు దృష్టికి రాలేదా ? వైసిపినేతల ప్రచారంతో ప్రాజారోగ్యానికి ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసిన చంద్రబాబు మరి టిడిపినేతల ప్రచారం గురించి ఏమంటారు ?
ప్రతిపక్షంలో ఉన్న తమ నేతలే ప్రచారం చేసుకుంటున్నపుడు అధికారంలో ఉన్న వైసిపినేతలు మాత్రం ఎందుకు ప్రచారం చేసుకోకుండా ఉంటారన్న కనీస ఇంగితం కూడా లోపిచింది. పైగా వైసిపినేతలు లేదా అభ్యర్ధుల నిత్యావసరాల పంపిణి, ప్రభుత్వం తరపున వెయ్యి రూపాయలు ఇస్తున్న ఫొటోలను మాత్రం ఎన్నికల కమీషన్ కు అందించటమే విచిత్రంగా ఉంది. అంటే తనకో రూలు, అధికార పార్టీకి మరో రూలుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఏదేమైనా కిందపడినా తనదే పై చెయ్యి అన్నట్లుగా ఉంది చంద్రబాబు వ్యవహారం. ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నా సర్వ వ్యవస్ధలు తాను చెప్పినట్లే వినాలని అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.
ప్రజారోగ్యానికి ప్రమాదమంటే వైసిపిఅయినా టిడిపినేతలైనా ఒకటేగా ఉంటుంది కదా ? నిమ్మగడ్డకు రాసిన లేఖలో తమ పార్టీవాళ్ళ ప్రచారంపై కూడా చర్యలు తీసుకోమని ఎందుకు డిమాండ్ చేయలేదు ? ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలను వైసిపినేతలే కాదు సొంతపార్టీ నేతలు కూడా ఉల్లంఘిస్తునే ఉన్నారు. తమ పార్టీనేతలు ఉల్లంఘనలను ప్రస్తావించకుండా కేవలం వైసిపినేతలపైన మాత్రమే ఆరోపణలు చేయటమంటే గురువింద గింజ సామెతనే గుర్తుచేస్తోంది చంద్రబాబు ఆరోపణలు కూడా.
]]>